7 రోజులు, 14 రోజులు, 28 రోజులు వ్యాలిడిటీ అంటూ టెలికాం కంపెనీలు వినియోగదారులను ఇన్నాళ్లు అందినకాడికి దోచుకున్నాయి. అలా రోజురోజుకి టెలికాం కంపెనీల ఆగడాలు మితిమీరిపోవడంతో.. టెలికాం నియంత్రణా సంస్థ ట్రాయ్ రంగంలోకి దిగింది. ఇష్టమొచ్చిన ప్లాన్స్ తో వినియోగదారులను ఇన్నాళ్లు దోచుకుంది చాలు.. ఇకపై తప్పనిసరిగా నెల రోజుల కాలవ్యవధితో కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తేవాలని టెలికాం నెట్వర్క్ సంస్థలను ట్రాయ్ ఇటీవల ఆదేశించింది. దీంతో అన్ని కంపెనీలు 30 లేదా 31 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి.
నెల రోజుల గడువుతో ప్లాన్స్ అందుబాటులోకి రావడంవల్ల వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరింది. ముఖ్యంగా ఏడాదికాలంలో చేసుకోవాల్సిన రీఛార్డుల సంఖ్య తగ్గుతుంది. 28 రోజుల కాలవ్యవధి ప్లాన్స్ వల్ల ఏడాదికి 13 సార్లు రీచార్జి చేయాల్సి వచ్చేది. ఇకపై 12 సరిపోతాయి. మరి వివిధ సంస్థలు అందిస్తున్న నెలరోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఏంటో చూద్దాం..
జియో రూ.259 ప్లాన్:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ నెల రోజులు. అంటే నెలకు 30 రోజులున్నా.. 31 రోజులున్నా ప్లాన్ నెల మొత్తం వస్తుంది. ప్రతినెలా ఒకే తేదీన రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ లో ప్రతిరోజు 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు సహా ఇతర ప్రయోజనాలను జియో అందిస్తోంది.
అలాగే జియోలో నెల రోజుల వ్యాలిడిటీతో రూ. 296 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో ఒకేసారి 25 జీబీ డేటా లభిస్తోంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు ఉన్నాయి. ఈ రెండు ప్లాన్లలో జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
ఎయిర్ టెల్ రూ. 319 ప్లాన్:
భారతీ ఎయిర్ టెల్ లో నెలరోజుల వ్యాలిడిటీ ప్లాన్ ను రూ.319కు అందజేస్తోంది. ఈ ప్లాన్ లో రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. వింక్ మ్యూజిక్, అపోలో 24/7 సర్కిల్ వంటి ఎయిర్టెల్ ధ్యాంక్స్ ప్రయోజనాలు అదనం.
దీంతో పాటు జియో తరహాలోనే ఎయిర్ టెల్ కూడా రూ. 296 ప్లాన్ ను అందిస్తోంది. ఈ ప్లాన్ లో రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. వింక్ మ్యూజిక్, అపోలో 24/7 సర్కిల్ వంటి ఎయిర్టెల్ ధ్యాంక్స్ ప్రయోజనాలు అదనం.
వొడాఫోన్ ఐడియా:
నెలరోజుల కాలవ్యవధితో వొడాఫోన్ ఐడియా మూడు ప్లాన్లను అందిస్తోంది.
రూ. 195 ప్లాన్:
ఈ ప్లాన్ లో కేవలం 2 జీబీ డేటా మాత్రమే లభిస్తోంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్ లు కూడా ఉంటాయి.
రూ. 319 ప్లాన్:
ఈ ప్లాన్ లో రోజుకి 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో పాటు వీఐ మూవీస్, టీవీ సబ్స్క్రిప్షన్ వంటి వీఐ హీరో అపరిమిత ప్రయోజనాలు అందనున్నాయి.
రూ.337 ప్లాన్:
ఈ ప్లాన్ లో ఒకేసారి 28 జీబీ డేటా వస్తుంది. అపరమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు, వీఐ మూవీస్, టీవీ క్లాసిక్ కు ఉచిత అనుమతి లభిస్తుంది. డేటా వినియోగంపై రోజువారీ పరిమితి ఉండదు.
బీఎస్ఎన్ఎల్:
బీఎస్ఎన్ఎల్ లో ప్రత్యేకంగా నెలరోజుల వ్యాలిడిటీతో అందిస్తోన్న ప్లాన్స్ ఏమీలేవు. అయితే, 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లను మాత్రం అందిస్తోంది.
రూ.147 ప్లాన్:
ఈ ప్లాన్ లో 10 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి ప్రయోజనాలను పొందొచ్చు.
రూ.247 ప్లాన్:
ఈ ప్లాన్ లో ఒకేసారి 50 జీబీ డేటా లభిస్తుంది. రూ.10 మెయిన్ టాక్ టైం, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 ఎస్ఎంఎస్లు, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, ఈరోస్ నౌ ఎంటర్ టైన్ మెంట్ సర్వీసెస్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
రూ. 299 ప్లాన్:
ఈ ప్లాన్ లో యూజర్లకు ప్రతిరోజూ 3జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు ఉంటాయి.
ఈ ప్లాన్లతో ప్రతినెలా ఒకే తేదీన తిరిగి రీఛార్జి చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే జులై 10న తొలి రీఛార్జి చేస్తే తిరిగి ఆగష్టు 10న, సెప్టెంబర్ 10న, అక్టోబర్ 10న.. అలా ప్రతినెలా పదో తేదీన రీఛార్జి చేసుకోవాలి. దీనికి వీఎస్ఎస్ఎల్ మాత్రం ఈ ప్లాన్ కు మినహాయింపు. ఇందులో కేవలం 30 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అంటే 31 రోజులు ఉన్న నెలలో ఒకరోజు ముందుగానే రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. పైన చెప్పబడిన ప్లాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.