రిలయన్స్ కంపెనీ రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. నిజంగా ఇది ఎంతోమంది నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పవచ్చు.
ఒక సంస్థ ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందంటే.. అక్కడ లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు దొరుకుతాయి. తమ వ్యాపారాలను అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరింపజేసుకునే ప్రక్రియలో పెట్టుబడులు భారీగా పెడతారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. తాజాగా రిలయన్స్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ కొత్త పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో లక్షకు పైగా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. డిసెంబర్ 2023 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఈ క్రమంలో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు ఉంటాయని ఆయన అన్నారు.
5జీ మొబైల్ టెలిఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, రిలయన్స్ రిటైల్ నెట్వర్క్ ను విస్తరించేందుకు, అలానే రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సెటప్ చేయడానికి రాష్ట్రంలోని రానున్న నాలుగేళ్లలో రూ. 75 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రతిష్టాత్మకమైన బయో-ఎనర్జీ వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బయో-ఎనర్జీ వ్యాపారం వైపు ఆయిల్ నుంచి టెలికాం సమ్మేళనం ముందడుగు వేయనుందని తెలిపారు. ఈ బయో-ఎనర్జీ వ్యాపారంతో వ్యవసాయ వ్యర్థాలను గ్యాస్ తయారు చేస్తామని అన్నారు. ఆ గ్యాస్ ని ఇంధన పరిశ్రమలు, ఆటోమొబైల్, వంట గ్యాస్ గా వాడుకోవచ్చునని అన్నారు. ఇది రైతులకు ఎంతగానో ప్రయోజనాలు చేకూరుస్తుందని అన్నారు. రైతుల నుంచి వ్యవసాయ వ్యర్థాలను కొనుగోలు చేసి.. వాటితో గ్యాస్ తయారు చేస్తామని అన్నారు. ఈ వ్యాపారం పర్యావరణాన్ని కాపాడుతుందని అన్నారు.
ఉత్తర ప్రదేశ్ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద న్యూ ఎనర్జీ ఆర్మ్ ని 10 జిగా వాట్ల సామర్థ్యంతో రూపొందిస్తున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. రాబోయే 10 నెలల్లో 10 జిగా వాట్ల సామర్థ్యం కలిగిన రెన్యువబుల్ ఎనర్జీ సేవలను, 5జీ సేవలను రాష్ట్రంలో రిలయన్స్ గ్రూప్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అదనంగా రూ. 75 వేల కోట్ల పెట్టుబడులను యూపీలో రాబోయే నాలుగేళ్లలో పెట్టుబడిగా పెడతామని.. జియో, రిటైల్, రెన్యువబుల్ వ్యాపారాలను విస్తరిస్తామని అన్నారు. ఈ కొత్త పెట్టుబడులు.. రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని అన్నారు. ఇప్పటికే రిలయన్స్ కంపెనీ రాష్ట్రంలో 50 వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది.
రిలయన్స్ జియో, దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ. ఎక్కువ వినియోగదారులు కలిగిన రిలయన్స్ జియో.. డిసెంబర్ 2023 నాటికి రాష్ట్రంలో ప్రతీ పట్టణానికి, ప్రతీ గ్రామానికి 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సేవలు వ్యాపారం మరియు పరిశ్రమలు, వ్యవసాయం, సామాజిక రంగం, పాలన రంగం వంటి ఏరియాల్లో ఆధునీకరణ తీసుకురావడంలో సహాయపడుతుందని అన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న ప్రజలు భరించగలిగే అత్యంత సరసమైన ధరలో ఉన్నత తరగతి విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం జియో స్కూల్, జియో ఏఐ డాక్టర్ అనే రెండు సరికొత్త వినూత్న ప్రాజెక్టులను రిలయన్స్ కంపెనీ రూపొందిస్తోంది.
రిలయన్స్ రిటైల్ రాష్ట్ర వ్యాప్తంగా వేల కిరాణా షాపులు, చిన్న స్టోర్లు ఇంకా అభివృద్ధి చెందేలా, ఎక్కువ ఆదాయం సంపాదించేలా, వ్యాపారాలు ఎక్కువ పెరిగేలా ఒక విప్లవం తీసుకొస్తుందని అన్నారు. మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా దగ్గరలో ఉన్న కిరాణా స్టోర్స్ ని వెతికే వినియోగదారులను, స్థానికంగా ఉన్న స్టోర్స్ ని ఏకం చేస్తుందని, అలానే నిత్యావసర సరుకులను డెలివర్ చేస్తుందని అన్నారు. రిలయన్స్ రిటైల్ ద్వారా కష్టపడే రైతులు, స్థానిక కళాకారులు, హస్త కళాకారులు, ఎంఎస్ఎంఈ.. అలానే రాష్ట్రంలో ఉన్న సరఫరా గొలుసు పర్యావరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. భారతదేశం చాలా బలమైన వృద్ధి బాటలో నడుస్తుందని విశ్వసిస్తున్నట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు. అభివృద్ధి చెందిన ప్రపంచంలో
ప్రపంచంలోనే అత్యధికంగా దూరదృష్టి గల నాయకత్వం, అపూర్వమైన ఆశ, ఆశావాదం కలిగిన యువకులు ఈ దేశంలో ఉన్నారని, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే టెక్నాలజీని ఆలింగనం చేసుకునే యువత మన దేశంలోనే అధికమని ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మూలాధారాలను ప్రపంచంలో ఎవరూ ప్రశ్నించలేరని, ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉంటుందని, ఇప్పుడు అన్ని సంస్థలకు మాతో కలిసి ఈ వేగాన్ని అందుకునే సమయం వచ్చిందని అన్నారు. దేశంలోనే జనాభా అధికంగా ఉన్న యూపీ రాష్ట్రాన్ని మనమంతా కలిసి దేశంలో సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా మార్చగలమని ఆయన అన్నారు. మరి రిలయన్స్ గ్రూప్ నాలుగేళ్లలో 75 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.