సొంత కారు కొనుక్కోవాలి అనేది ప్రతి ఒక్కరి కల. కానీ, అందుకు చాలా సమయం పట్టవచ్చు. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తి కారు కొనడం అంత తేలికైన విషయం కాదు. అయితే ఎప్పుడోకప్పుడు కారు కొనాలి అని ఎదురుచూస్తున్న వారికి ఇది చేదు వార్తనే చెప్పాలి. ఎందుకంటే కార్ల కంపెనీలు వాటి ధరలను పెంచేస్తున్నాయి. అందుకు సంబంధించిన కారణాలు తెలుసుకోండి.
ఒకప్పుడు కారు అనేది విలాస వస్తువు అని చెప్పేవారు. కానీ, ఇప్పుడు మాత్రం కారు అనేది అవసరం కేటగిరీలోకి వచ్చేసింది. మెట్రోపాలిటన్ సిటీల్లో నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి కారు తప్పక ఉండాల్సిందే. లేదంటే ప్రయాణ సమయాల్లో బాగా ఇబ్బంది పడతారు. అయితే కారు కొనడం కలగా పెట్టుకున్న ఎంతో మంది మధ్యతరగతి వ్యక్తుల నెత్తిన రాయి పడ్డట్లు అయ్యింది. ఎందుకంటే భారత్ లో కార్ల ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వాటి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు కంపెనీలు వరకు ఈ విషయాన్ని వెల్లడించాయి. లగ్జరీ కార్ల సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
కార్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కో కంపెనీ తమ కార్ల ధరలను రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచుతున్నాయి. ఈ లిస్టులో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీ, మెర్సిడజ్ బెంజ్ వంటి కంపెనీలు వాటి కార్ల ధరలను పెంచాయి. టాటా మోటార్స్ మరోసారి ధరను పెంచాయి. మొన్న ఫిబ్రవరిలో ప్యాసింజర్ వెహికిల్స్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ పోర్ట్ ఫోలియోపై 1.2 శాతం ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్యాసింజర్ కార్లపై 0.6 శాతం వరకు ధరను పెంచాయి. రూ.5.5 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉన్న టియాగో, టిగోర్, అల్ట్రోజ్, పంచ్, నెక్సన్, హ్యారియర్, సఫారీ మోడల్స్ ధరలు పెరగనున్నాయి.
మారుతీ సుజుకీ తమ ప్రీమియం బ్రాండ్ నెక్సాకు చెందిన ఎక్స్ఎల్ 6, సియాజ్ మోడల్స్ పై ధరను పెంచింది. ఎక్స్ఎల్ సిక్స్ పై రూ.15 వేలు, సియాజ్ వాహనంపై రూ.11 వేల వరకు ధరలు పెచింది. ధరలు పెరిగిన తర్వాత ఎక్స్ఎల్ 6 వాహనం ఎక్స్ షోరూమ్ ప్రైస్ రూ.11.56 లక్షలుగా ఉంది. మహీంద్రా కంపెనీ లవర్స్ కి అయితే ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మహీంద్రా థార్ మోడల్ మీద గరిష్టంగా దాదాపు రూ.1.05 లక్షల వరకు ధర పెరిగింది. ఎక్స్యూవీ 700 ధరను కూడా రూ.71,400 వరకు పెంచారు. ఇంక మెర్సిడిజ్ బెంజ్ వంటి లగ్జరీ కార్లు సైతం వాటి కార్ల ధరలను పెంచుతున్నాయి. ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రధానమైన అనుమానం అసలు కార్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
The decision to hike the price of Thar SUV comes after the new BS-6 Phase 2 emission norms kicked in from April 1 across India. However, Mahindra has not officially shared any reason behind the price hike.#Mahindra #MahindraThar #Thar #SUV @Mahindra_Thar pic.twitter.com/hS1Pzne0yr
— Car News Guru (@CarNewsGuru1) April 14, 2023
కార్ల ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిజానికి గతేడాది డిసెంబర్ రెండోవారంలోనే చాలా కంపెనీలు తమ కార్ల ధరలను పెంచబోతున్నట్లు వెల్లడించాడి. ఇందుకు ఫలానా అని ఒకటే కారణాన్ని చెప్పడానికి లేదు. ఇందుకు ప్రధానంగా విదేశాల్లో ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్భణం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వీటివల్ల కంపెనీలకు కారు తయారీ ధరలు పెరుగుతున్నాయి. అంటే పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. అలా అయితే కచ్చితంగా అది వినియోగదారుడి మీదే పడుతుంది. కారు తయారీలో మౌంటింగ్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. అందుకు కూడా కార్ల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. పైగా కేంద్రం తీసుకొచ్చిన బీఎస్6 ఫేజ్ టూ నిబంధనలు కూడా కార్ల తయారీ ధర పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఇలా ధరలు పెరిగితే మధ్యతరగతి వ్యక్తి కారు కొనగలడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#TataMotors to hike car & SUV prices from May 1, 2023 by around 0.6% due to “increased costs on account of regulatory changes & rise in overall input costs”. This is its second price hike in CY2023, the first (on its ICE models by 1.2%) was on February 1 pic.twitter.com/HOGa9tjGed
— Markets Today (@marketsday) April 14, 2023