ఆర్బీఐ మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది. తాజాగా వడ్డీ రేటు 4.40 శాతానికి పెంచుతూ హఠాత్తుగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెంపు తక్షణమే మే 4 నుంచే అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు. ఇక దీంతో పాటు క్యాష్ రిజర్వ్ రేషియోను 50 బేసిస్ పాయింట్లు పెంపు కూడా మే 21 నుంచి అమల్లోకి రానుంది.
ఇటీవల ఆర్ధిక వ్యవస్థ గాడిన పడే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం వచ్చి పడింది. దీంతో యూరప్, అమెరికా సహా అనేక దేశాలు రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. దీంతో పాటు అతి పెద్ద సరఫరాదారుగా ఉక్రెయిన్‌లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం సవాల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి తగ్గిపోయింది. ఈ కారణంతోనే ఆర్బీఐ సర్థుబాటు ధోరణికి స్వస్తి పలికి రేపో రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: LIC IPO సందడి షురూ! మే 4 నుంచి 9 వరకు ఇష్యూ..!
ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యులకు కాస్త భారంగా ఉండనుందనే తెలుస్తోంది. బ్యాంకులు కస్టమర్లకు పర్సనల్ లోన్లు, వాణిజ్య, హోమ్ లోన్స్ వంటి వాటిపై అధికంగా వడ్డి రెట్లు పెరగనున్నాయి. దీంతో సామాన్యులకు మరోసారి షాక్ కు గురి చేసినట్లు అవుతోంది. చివరి సారిగా 2018 ఆగస్టులో వడ్డీరేట్లు ఆర్బీఐ పెంచింది. ఆర్బీఐ తాజా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.