సాధారణంగా అప్పు చేయని మానవుడు ఉండడు. కుటుంబ అవసరాల కోసమో.. లేదా ఇల్లు కట్టుకోవడానికో.. పెళ్లి కోసమో మధ్య తరగతి మనిషి అప్పు చేయడం సహజం. అందులో భాగంగానే అతడు బ్యాంకులు, రుణ సంస్థల దగ్గర నుంచి రుణం తీసుకుంటాడు. అలాగే అతడు ఆ అప్పును తల తాకట్టు పెట్టి అయినా తిరిగి చెల్లించాలని చూస్తాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాత్రమే అతడు అప్పు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆ రుణ గ్రహితను బ్యాంక్ అధికారులు, ప్రైవేట్ రుణ సంస్థలు వేధించడం ప్రస్తుత కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వేధింపులపై తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన జారీ చేసింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత కాలంలో రుణాలు కట్టలేదని లోన్ తీసుకున్న వారిని రుణం ఇచ్చిన సంస్థలు వేధించడం వల్ల బాధితుడు చనిపోయిన సంఘటనలు మనం చాలా చూశాం. ఒక వ్యక్తి రుణం తీసుకున్నాడు. అనుకోని కారణాల వల్ల అతడు ఆ రుణాన్ని సమయానికి చెల్లించలేకపోయాడు. దీంతో ఆ బ్యాంక్, రుణ సంస్థలు అతడిని వేదించ సాగాయి. అదీ కాక అతడి బంధువులకు, స్నేహితులకు కాల్ చేసి అతడు డబ్బులు కట్టడం లేదని చెబుతున్నారు. దీంతో అతడు తన పరువు పోయిందని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటుండటంతో RBI ఓ కీలక ప్రకటనను శుక్రవారం జారీ చేసింది.
RBI జారీ చేసిన మార్గదర్శకాలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు, రుణ సంస్థలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రుణ గ్రహితకు సంబంధించి వారు అనుసరించాల్సిన విధి విధానాలను అందులో పొందుపరిచింది. RBI తాను జారీ చేసిన ప్రకటనలో ఈ విధంగా పేర్కొంది.. ” ప్రస్తుతం బ్యాంకులు, రుణ సంస్థలు లోన్ తీసుకున్న వ్యక్తి తిరిగి ఆ మెుత్తాన్ని చెల్లించకపోతే.. అతడి ఫోన్ కు కాల్ చేయడమో, లేదా అతడి స్నేహితులు, బంధువులకు కాల్ చేస్తున్నారు. ఇక నుంచి అలా చేయరాదు. అంటూనే రుణ గ్రహితల ఫోన్ లకు బెదిరింపు మెసెజ్ లు, కేసులు పెడతాం, సోషల్ మీడియాలో మీ పరువు తీస్తాం అంటూ బెదిరించడం కూడా ఇక మీదట చెల్లదు. అలాగే వారిని అసభ్య పదజాలంతో, వారి పై భౌతికంగా దాడి చేసి వేధించకూడదు. అలాగే ఉదయం 8గంటల ముందు.. రాత్రి 7 గంటల తర్వాత వారికి ఫొన్ చేయరాదు.” అంటూ జారీ చేసిన ప్రకటనలో తెలిపింది.
కొన్ని రుణ సంస్థలు లోన్ రికవరీని థర్డ్ పార్టీలకు అప్పగిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయా ఏజెంట్ల చర్యలకు ఆ సంస్థలే బాధ్యత వహించాలని ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనలు మైక్రో లోన్ల విషయంలో వర్తించవని తెలిపింది. దీన్నివినియోగదార్లు దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. అయితే RBI తాజాగా జారీ చేసిన ఈ ప్రకటనతో రుణ గ్రహితలకు కొంత వరకు ఊరట కలిగించిందనే చెప్పాలి. మరి ఈ నిబంధనలను బ్యాంకులు, రుణ సంస్థలు ఏమేరకు పాటిస్తాయో వేచి చూడాలి. తాజాగా ఆర్బీఐ జారీ చేసిన ఈ ఆదేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Outsourcing of Financial Services – Responsibilities of regulated entities employing Recovery Agentshttps://t.co/QrCWEyHWqv
— ReserveBankOfIndia (@RBI) August 12, 2022