సామాన్యులపై రిజర్వ్‌బ్యాంక్ అఫ్ ఇండియా మరోసారి కొరడా విదిలించింది. ముందుగా ఊహించనట్లుగానే రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల (0.35 శాతం) మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏడు నెలల్లో ఐదుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఏప్రిల్‌లో 4 శాతంగా ఉన్న రెపో రేటు ఇప్పుడు ఏకంగా 6.25 శాతానికి పెరిగింది. అంటే ఈ ఏడు నెలల కాలంలో 2.25 శాతం మేర వడ్డీ రేటు పెరిగిందన్నమాట. ఈ పెంపుతో వడ్డీ రేట్లు మరింత భారం కానున్నాయి.
రెపో రేటు అంటే.. ఆర్బీఐ, బ్యాంకులకు ఇచ్చే నిధులపై వడ్డీ రేటు అనమాట. ఇది పెంచితే బ్యాంకులు ఆర్బీఐకి వడ్డీ అధికంగా చెల్లించాల్సి వస్తుంది. దీంతో బ్యాంకులు ఈ భారాన్ని ప్రజలపైకి మళ్లిస్తాయి. అందుకోసం.. ఆయా రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతుంటాయి. ఇది ఎక్కువగా హోం లోన్లపై ప్రభావం చూపుతుంది. దీంతో బ్యాంకుల నుంచి హోం లోన్ తీసుకున్నవారు, తీసుకోబోయేవారు ఎక్కువ EMI లు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా లోన్ తీసుకునేవారు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుండగా.. ఇప్పటికే లోన్ తీసుకున్నవారి ఇన్‌స్టాల్‌మెంట్ పెరుగుతుంది. హోం లోన్లతో పాటు ఎడ్యుకేషనల్, వెహికిల్, పర్సనల్, బిజినెస్ లోన్లు కూడా ప్రియం అవుతాయి.
Repo rate, reverse repo rate and it’s significance: pic.twitter.com/ePTo55DX77
— CA Anurag Sharma (@caanuragwriter) May 4, 2022
ఉదాహరణకు ఈ ఏడాది ఆరంభంలో ఒక వ్యక్తి 7 శాతం వడ్డీకి.. 20 ఏళ్ల కాలవ్యవధితో రూ.30 లక్షలు లోన్ తీసుకున్నాడనుకుందాం. అప్పుడు అతని ఇంస్టాల్ మెంట్ అమౌంట్.. రూ.23,258. ఈఇప్పుడు ఈ ఏడాది పెరిగిన రెపోరేటు 2.25 శాతం కలుపుకుంటే వడ్డీ 9.25 శాతానికి పెరుగుతుంది. దీంతో అతడు కట్టాల్సిన ఈఎంఐ కూడా నుంచి రూ.27,387 కు పెరిగిందన్నమాట. ప్రతి ఒకరికి ఇంతే పెరగాలని ఉండదు. వారు తీసుకున్న కాలవ్యవధి, అమౌంట్, ఆ సమయంలో ఉన్న వడ్డీ రేట్లను బట్టి ఉంటుంది. అయితే ఇదే సమయంలో తక్కువ కాలపరిమితితో లోన్లు తీసుకున్నవారికి మాత్రం పెద్దగా ప్రభావం పడదు.
RBI’s Monetary Policy Committee (MPC) hiked the benchmark policy rate (repo rate) by 35 bps to 6.25%. 5 out of 6 MPC members voted in favour of hiking the Repo rate by 35 bps while 1 member voted against the repo rate hikehttps://t.co/EoU9R8GSWE
— Economic Times (@EconomicTimes) December 7, 2022