ఆర్బీఐ 2 వేల రూపాయల నోటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వెయ్యి రూపాయల నోటు మళ్లీ వాడుకలోకి తీసుకు వస్తున్నారు అనే ప్రచారం తెర మీదకు వచ్చింది. దీనిపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2వేల నోటు రద్దు చేస్తూ.. నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక 2 వేల రూపాయల నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత లేకపోయినా.. విపక్షాలు మాత్రం ఈ నిర్ణయంపై విమర్శలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో.. ఎలక్షన్స్‌లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవడం కోసమే.. ఈ నిర్ణయం తీసుకువచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల అవినీతిపరులు, నల్లధనం వెలికి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇదిలా ఉండగా.. రెండు వేల రూపాయల నోటు రద్దు నిర్ణయం నేపథ్యంలో.. మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు వేల రూపాయల నోటు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం దాని స్థానంలో వెయ్యి రూపాయల నోటును తిరిగి తీసుకురానుంది అనే ప్రచారం తెర మీదకు వచ్చింది. అయితే దీనిపై ఆర్బీఐ గవర్నర్ స్పందిస్తూ.. కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..
ఈ ప్రచారంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. ‘‘వెయ్యి రూపాయల నోటు తీసుకురాబోతున్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తవం. అవన్ని ఊహాగానాలు మాత్రమే. మా దగ్గర అలాంటి ప్లాన్స్ ఏం లేవు’’ అని స్పష్టత ఇచ్చాడు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇక మీదట పెద్ద నోట్లను తీసుకురాదు అనే విషయంపై ఓ స్పష్టత వచ్చింది. కొందరు ఆర్థిక నిపుణులు మాత్రం 500 రూపాయల నోటు కూడా రద్దు చేస్తే మంచిది అంటున్నారు. ఇక రూ.2 వేల నోటు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్.. దీనిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు నాలుగు నెలల సమయం ఇచ్చినట్లు వెల్లడించారు.
అంతేకాక రెండు వేల రూపాయల నోటు రద్దు చేయలేదని.. ఈ కరెన్సీ చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు ఆర్‌బీఐ గవర్నర్. ఇండియన్ కరెన్సీ నిర్వహణా వ్యవస్థ బలంగా ఉందని… అందువల్ల ఈ నాలుగు నెలల్లో రూ. 2 వేల నోటు మార్చుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పుకొచ్చారు. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు 2000 వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. మరి 2 వేల రూపాయల నోటు రద్దు నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.