చెల్లింపుల్లో పారదర్శకత, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉంటుందంటూ కేంద్రం గత కొన్నేళ్లుగా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు ఎంతగా ఈ ఆన్‌లైన్ పేమెంట్స్ కు అలవాటు పడ్డారంటే 10 రూపాయలు చెల్లించాలన్నా యూపీఐ ద్వారా చెల్లిస్తున్నారు. జేబులో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. డబ్బు లేకపోయినా బయటకు వెళ్లి కావాల్సినవి అన్నీ కొనుక్కుని వచ్చేయచ్చు.
ప్రజలు అంతలా యూపీఐ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. అయితే, ఇప్పుడు ఆర్బీఐ నుంచి వినిపిస్తన్న మాటలు సామాన్యులను కలవరానికి గురి చేస్తున్నాయి. ఆర్బీఐ బుధవారం చెల్లింపుల విధానాలకు డిస్కషన్ పేపర్ విడుదల చేసింది. యూపీఐ చెల్లింపుల విధానం అనేది పూర్తిగా ఉచితంగా అందించాలంటూ కేంద్రం దిశానిర్దేశం చేసింది అని తెలుపుతూనే ఛార్జెస్ తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఎలా ఛార్జెస్ వసూలు చేయచ్చు అనే ప్రశ్నలపై ఫీడ్ బ్యాక్ కోరడం కాస్త చర్చకు దారి తీసింది.
యూపీఐ చెల్లింపుల విధానంలో ఆర్బీఐ అధిక పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. యూపీఐ చెల్లింపులు కూడా ఐఎంపీఎస్ లాంటివే కాబట్టి వాటిపై కూడా ఛార్జీలు ఉండాలంటూ వాదనలు వినిపిస్తుంటాయంటూ ప్రస్తావించింది. అయితే ఐఎంపీఎస్ తరహాలో యూపీఐ చెల్లింపులకు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అంటూ యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ ఫీడ్ బ్యాక్ కోరింది. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నలు చూసిన తర్వాత ఆర్బీఐ తప్పుకుండా వీటిపై ఛార్జెస్ తీసుకొస్తుందంటూ పలు అనుమానాలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అదే నిజమైతే మళ్లీ ప్రజలంతా నగదు బదిలీలకు మళ్లుతారు. మళ్లీ పాత విధానంలో డబ్బు వాడకం పెరుగుతుంది. కేంద్రం ఏ ఉద్దేశంతో యూపీఐని తీసుకొచ్చిందే అది దెబ్బతింటుంది అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూపీఐ చెల్లింపులపై ఛార్జెస్ కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“Should UPI transactions stay free?”
Like drug peddlars who sell the opening shots cheaply to get you hooked, “fintech” is just a way of fleecing a billion bakras.
An RBI paper moots imposing a “tiered” charge on payments through UPI. So, you pay for giving your money. pic.twitter.com/H8hV4oq7xL— Sachin Agarwal (@SachinA34217498) August 18, 2022
RBI tiered charge on payments through UPI
Currently no cost is incurred by users or merchants in the case of payments made through UPI.For a person-to-merchant transaction of Rs 800 on UPI collectively,the stakeholders incur Rs2 for processing the transaction the RBI has pic.twitter.com/RRiFAyutLo— RASHEED (@uddinr20) August 18, 2022