రిజర్వ్ బ్యాంక్ ఆఫ్(ఆర్బీఐ) ఇండియా గత కొన్ని రోజులుగా పలు బ్యాంకులకు వరుస షాకులిస్తుంది. మార్గదర్శకాలను పాటించని బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. గతంలో మాదిరి జరిమానాలతో సరిపెట్టడం లేదు.. ఏకంగా లైసెన్స్‌లు క్లోజ్ చేస్తుంది. ఇప్పటికే రెండు బ్యాంకు లైసెన్స్‌లు రద్దు చేసిన ఆర్బీఐ.. తాజాగా మరో బ్యాంకును శాశ్వతంగా మూసి వేసుందుకు రెడీ అయ్యింది. పూణేకు చెందిన రూపీ కోఆపరేటివ్ బ్యాంకు మూతపడిన ఒక్క రోజులోనే.. మరో బ్యాంకుపై ఆర్‌బీఐ వేటు వేసింది. రూపీ బ్యాంక్ కన్నా ముందు ఆర్బీఐ డెక్కన్ ఆర్బన్ కోపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ రద్దుకి ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడం, నష్టాలను తగ్గించడం కోసం ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటుంది. నష్టాల్లో ఉన్న బ్యాంక్‌లను విలీనం చేయడం.. నిబంధలను సరిగా పాటించిన వాటిపై చర్యలు తీసుకోవడం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా నిబంధనలు అతిక్రమించిన బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. దానిలో భాగంగా తాజాగా మహారాష్ట్రలోని లక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ లైసెన్సును ఆర్బీఐ రద్దు చేసింది. ఈ బ్యాంకులో డిపాజిట్ దారులకు రూ.5 లక్షల వరకు రిటర్ను చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది.
రిజర్వు బ్యాంకు ఆర్డర్‌తో లక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు ఇక నుంచి ఎలాంటి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు చేయడానికి వీలు లేదు. ఈ బ్యాంక్ వద్ద కార్యకలపాలు నిర్వహించడానికి అవసరమైన మూలధనం లేకపోవడంతో ఆర్బీఐ లైసెన్స్ రద్దు నిర్ణయం తీసుకుంది. ఇక ఆర్‌బీఐ నుంచి నోటీసు వెలువడిన తర్వాత.. ఈ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసిన వారు.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) నుంచి రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ క్లయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇక సెప్టెంబర్ 22 నుంచే ఈ ఆర్డర్ అమల్లోకి వస్తుందని ఆర్బీఐ వెల్లడించింది. సరిపడా మూలధనం లేనందున ఈ బ్యాంక్ ఇంకా ఆర్థికలావాదేవీలు నిర్వహిస్తే.. ప్రజా ప్రయోజనాలు దెబ్బ తింటాయని ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంక్ ఇచ్చిన వివరాల ప్రకారం.. 99 శాతం మంది డిపాజిటర్లు.. డీఐసీజీసీ నుంచి పూర్తి మొత్తం పొందే అవకాశం ఉందని వెల్లడించింది. డీఐసీజీజీ రిజర్వు బ్యాంకు సబ్సిడరీ. ఇది బ్యాంకు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ కల్పిస్తుంది. మరి మీకు లక్ష్మి విలాస్ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్నట్లయితే ఓ సారి చెక్ చేసుకొండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.