ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఇందుకే ఈ సృష్టిలో అన్నిటికన్నా శక్తివంతమైనది ధనమే అంటారు చాలా మంది. ప్రస్తుతం ప్రపంచాన్ని ముందుకి నడిపిస్తున్న ఇంధనం కూడా ఇదే. కానీ.., డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు. మన చేతిలో కొంత డబ్బు ఉంటే ఆ డబ్బే ఇంకొన్ని లక్షలను తెచ్చి పెడుతుంది. అంత వరకు ఎందుకు..? మన అదృష్టం బాగుంటే చేతిలో ఉండే ఒక్క రూపాయే లక్షలు తెచ్చి పెడుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజుల్లో చాలా మందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. ఈ-కామర్స్ సైట్లలో ఈ పాత నాణేలకి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. కాబట్టి.., 103 ఏళ్ల క్రితం నాటి ఓ రూ.1 కాయిన్ ఇప్పుడు మీ దగ్గర ఉంటే.., మీరు లక్షాధికారి అయిపోవచ్చు. బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ V కింగ్ నాణెం సుమారు 103 సంవత్సరాల క్రిందటిది. 1918లో తయారు చేసిన ఈ నాణెంపైన జార్జ్ V కింగ్ చిత్రం ముద్రించబడింది. నాణానికి మరొక వైపు, ఒక రూపాయి, ఇండియా, 1918 సంవత్సరం అని రాసి ఉంటుంది. మీ దగ్గర ఈ నాణెం ఉంటే వెంటనే www.quikr.com అనే వెబ్సైట్ లో అమ్మకానికి పెట్టవచ్చు.ఈ నాణెం సుమారు 5 లక్షల రూపాయల వరకు పలికే అవకాశం ఉంది.
దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా ఓల్డ్ కాయిన్స్ అమ్మడానికి క్విక్కర్ లో ఓ సపరేట్ వింగ్ ఉంది. అందులో మీ డీటైల్స్ ఫీల్ చేసి లాగిన్ అవ్వండి. ఆ తరువాత మీరు నాణేన్ని ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. ఇంతే.. ప్రాసెస్ పూర్తి అయిపోయినట్టే. ఈ కాయిన్ కావాలి అనుకున్నవారు మీరిచ్చిన డీటైల్స్ ఆధారంగా.. నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు ఆన్‌లైన్ డెలివరీ, పేమెంట్ సిస్టం ద్వారా ఈ నాణేన్ని అమ్మవచ్చు. పాత నాణేలను కొనుగోలు చేసే ఔత్సాహికులపై ధర ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మీరు నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ డబ్బు పొందే అవకాశం కూడా ఉంటుంది. సో.., ఒక్కసారి మీ గల్లా పెట్టె ని చెక్ చేసుకోండి. ఇలాంటి రూ.1 కాయిన్ మీ దగ్గర లక్షాధికారి అయిపోవచ్చు.