ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరల పెంపు అనేది సామాన్యుడిపై భారాన్ని మరింత పెంచుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే.. ఇంధన ధరలు మాత్రం తగ్గవు. కానీ తాజాగా ఓ చోట ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ఆ వివరాలు..
ప్రజలకు మేలు చేయడం, పేదలను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి. కొన్ని పథకాలు నిజంగా జనాలుకు ఉపయోగపడేవి ఉంటాయి. సదరు పథకాల వల్ల ప్రజలకు నిజమైన మేలు కలుగుతుంది. తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇంధన ధరలు మండుతున్న వేళ.. జనాలకు ఊరట కలిగించింది. గ్యాస్ సింలిండర్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది. కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ అందించే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇంతకు ఆ ప్రభుత్వం ఏది.. అంటే..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి కానీ…. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకం మాత్రం తీసుకురాలేదు. అసలు ఇంత వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పథకం తీసుకువచ్చే ఆలోచన కూడా చేయలేదు. కానీ తొలిసారి రాజస్థాన్ ప్రభుత్వం.. 500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందివ్వనుంది. ఈ పథకం వల్ల.. కోట్ల మందికి మేలు చేసినట్లు అవుతుంది అంటున్నారు జనాలు.
ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్… దీని కోసం రూ.750 కోట్లు కేటాయించారు. ఈ పథకం ఆ రాష్ట్రంలో 75 లక్షల ఫ్యామిలీలకు ప్రయోజనం కల్పించనుంది. ఈ పథకం కింద.. ఏప్రిల్ 1 నుంచి లబ్దిదారులు.. నెలకు 1 గ్యాస్ సిలిండర్‌ను రూ.500 చొప్పున పొందుతున్నారు. తొలుత ఎన్నికల వేళ ఈ పథకం గురించి హామీ ఇవ్వగా.. ఇది ఆచరణ సాధ్యం కాదని విపక్షాలు విమర్శించాయి. కానీ రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని అమలు చేసి చూపుతోంది. ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్ పొందినవారికి.. సిలిండర్‌పై సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
దీనిలో భాగంగా లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసి.. డబ్బులు చెల్లించిన తర్వాత.. సబ్సిడీ డబ్బు.. లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది. ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ ధరలు మారతుంటాయి. ఇప్పటి వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి కానీ.. గృహ వినయోగానికి వాడే ఎల్‌పీజీ ధరలు మాత్రం పెద్దగా తగ్గడం లేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వంటగ్యాస్ సిలిండర్లపై అంతగా సబ్సిడీ ఇవ్వట్లేదు. మరి రాజస్థాన్ ప్రభుత్వం ఇస్తోంది కాబట్టి.. మిగతా రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఆలోచిస్తే మంచిదే అంటున్నారు నెటిజన్లు. మరి రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.