భారత రైల్వే శాఖ తమ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. అంతేకాదు భారత రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో రైల్వే ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. గతంలో టికెట్ బుకింగ్ సమయంలో క్యాటరింగ్ సర్వీసులు తీసుకోకపోతే రన్నింగ్ ట్రైన్ లో టీ, కాఫీ తాగాలంటే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు రైల్వేస్ తీసుకున్న నిర్ణయంతో ఈ సర్వీస్ ఛార్జ్ అనేది ఉండదు.
గతంలో రైలులో వెళ్తున్నప్పుడు క్యాటరింగ్ సర్వీస్ తీసుకోకుండా మీరు ట్రైన్ లో టీ, కాఫీ తాగాలంటే రూ.50 సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉండేది. అంటే మీరు రూ.20 టీ ఆర్డర్ చేస్తే సర్వీస్ ఛార్జ్ తో కలిపి అది రూ.70 అవుతుంది. అదే బిర్యానీ ఆర్డర్ చేస్తే రూ.200కు అదనంగా రూ.50 చెల్లించాలి. ఇలా ధర ఎంతైనా కూడా మీరు రూ.50 సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉండేది.
అదే మీరు టికెట్ బుకింగ్ సమయంలో క్యాటరింగ్ సర్వీస్ ను తీసుకుంటే మీరు అంత చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఐఆర్‌సీటీసీ తీసుకునే సర్వీస్ ఛార్జ్ కు సంబంధించిన ఇన్‌వాయిస్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం, వారిపై విమర్శలు రావడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏసీ బోగీలు, చైర్ కార్ వంటి విభాగాల వారీగా క్యాటరింగ్ ఛార్జెస్ మారుతూ ఉంటాయి. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.