మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్-ఐనాక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న ఆరు నెలల్లో భారీ ఎత్తున స్క్రీన్‌లు మూసివేయనుంది. ఎందుకంటే..
మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ ఎత్తున స్క్రీన్‌లు మూసివేతకు రెడీ అవుతోంది. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొనుంది అంటే.. నష్టాలు కారణం అంటున్నారు. కరోనా తర్వాత సినీ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా ఇంకా కోలుకోలేదు. దేశవ్యాప్తంగా చాలా థియేటర్‌లు క్లోజ్ అయ్యాయి. ప్రస్తుతం జనాలు ఎక్కువగా ఓటీటీలవైపే మొగ్గు చూపుతున్నారు. దాంతో థియేటర్‌లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పీవీఆర్ కూడా భారీ ఎత్తున నష్టాలు చవి చూసింది. ఈ నేపథ్యంలోనే స్క్రీన్‌లు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.
పీవీఆర్ ఐనాక్స్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారీ నష్టం చవి చూసింది. ఏకంగా 336 కోట్ల మేర నష్టాలను చవి చూసింది. దాంతో పీవీఆర్ ఐనాక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న 6 నెలల్లో 50 స్క్రీన్‌లను మూసి వేసేందుకు రెడీ కానుందని తెలుస్తోంది. మాల్స్‌లో ఉన్న ఈ ఆస్తుల వల్ల భారీ ఎత్తున నష్టాలు చవి చూస్తున్నామని పీవీఆర్ యాజమాన్యం వెల్లడించింది. ఈ స్క్రీన్స్ పునరుద్ధరణకు సంబంధించి ఎలాంటి ఆశలు లేకపోవడంతో.. వీటిని మూసివేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది,.
గతంలో ప్రత్యర్థులుగా ఉన్న పీవీఆర్, ఐనాక్స్ లీజర్.. 2023 ఫిబ్రవరిలో విలీనం అయ్యాయి. దీనిల్ల దేశంలో ఉన్న మొత్తం 9 వేల స్క్రీన్‌లలో పీవీఆర్-ఐనాక్స్ రెండింటికి కలిపి సుమారు 1689 స్క్రీన్‌లు కలిగి.. అతిపెద్ద సినిమా మల్టీప్లెక్స్ చెయిన్‌గా అవతరించింది. ఇవన్నీ ఇండియాతో పాటు శ్రీలంకలోని 115 నగరాల్లోని 361 సినిమా థియేటర్లలో విస్తరించి ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో పీవీఆర్-ఐనాక్స్ 30 సినిమా థియేటర్లలో 168 స్క్రీన్‌లను ప్రారంభించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 150-175 స్క్రీన్‌లను కొత్తగా తెరవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడుతుండటం, హాలీవుడ్ సినిమాలు ఎక్కువ సంఖ్యలో విడుదల కాకపోవడంలో గత ఆర్థిక సంవత్సరంలో చిత్ర పరిశ్రమ బాగా దెబ్బతిన్నట్లు పీవీఆర్-ఐనాక్స్ సిబ్బంది ఒకరు తెలిపారు.