లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) అంటేనే ప్రజలకు నమ్మకం ఎక్కువ. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కనుక.. ఎల్‌ఐసీ నుంచి ఏ స్కీమ్ వచ్చినా ప్రజలు ఆధరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల పాలసీలతో జనాల్ని ఆకర్షించిన ఎల్ఐసీ.. మరో మంచి పథకాన్ని కస్టమర్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది. పాలసీ అంటేనే భయపడే జనాలు సైతం.. ఈ మధ్య కాలంలో పాలసీలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది.
ఎల్‌ఐసీ నుంచి ఓ కొత్త స్కీమ్ అందుబాటులో ఉంది. దాని పేరు ‘ప్రధాన మంత్రి వయ వందన యోజన’ పథకం. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయస్సు 60 ఏళ్లు ఉండాలి. ఈ పథకం గడువు కాలం 10 ఏళ్లు ఉంటుంది. ఈ స్కీమ్ లో కనుక చేరారు అంటే ప్రతీ నెలా కూడా పెన్షన్ వస్తుంది. రిటైర్‌మెంట్ సమయంలో వచ్చిన డబ్బులను ఒకేసారి ఇన్వెస్ట్ చేసి నెల నెలా మీరు పెన్షన్ పొందొచ్చు. ఈ స్కీమ్ మీద వడ్డీ ఇప్పుడు 7.40 శాతం వుంది.
ఇది కూడా చదవండి: నెల నెలా 5000 పెన్షన్!.. ఈ స్కీములో చేరండి.
రిటైర్‌మెంట్ సమయంలో వచ్చిన డబ్బులైనా, రూపాయి రూపాయి దాచుకున్న డబ్బులైన ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 15 లక్షలు డిపాజిట్ చేశారు అంటే.. నెల నెలా రూ.9,250 పెన్షన్ పొందవచ్చు. ఇక 60 ఏళ్లు దాటిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా పెన్షన్ స్కీమ్‌లో రూ.30,00,000 వరకు పెట్టుబడి పెట్టి నెలకు రూ.18,500 చొప్పున పెన్షన్ పొందవచ్చు. పాలసీ గడువు ముగిసిన తర్వాత పెట్టిన పెట్టుబడి రూ.15,00,000 వెనక్కి ఇచ్చేస్తారు. మూడేళ్ళ తరవాత లోన్ కూడా పొందొచ్చు. గరిష్టంగా 75 శాతం వరకు రుణం వస్తుంది.
PM @NarendraModi launched Pradhan Mantri Vaya Vandana Yojana in 2017 to provide adequate social security to people in their old age. The time period for subscription for the scheme is extended up to 31st March 2020 so that more people can reap its benefits. #SocialSecurityInIndia pic.twitter.com/IIePQRlC6U
— NarendraModi App (@NamoApp) June 27, 2018
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం గడువును 2023 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ గడువులోగా స్కీమ్ లో చేరచ్చు. రూ.1,62,162 ఇన్వెస్ట్ చేసిన వారికి నెలకు రూ.1000, మూడు నెలలకు రూ.3000, ఆరు నెలలకు రూ.6000, ఏడాదికి రూ.12,000 చొప్పున పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్ లో గరిష్టంగా రూ.15,00,000 ఇన్వెస్ట్ చేసే అవకాశం వుంది.
Ensuring income security to our senior citizens by providing an assured minimum pension with Pradhan Mantri Vaya Vandana Yojana. Click to buy: https://t.co/6VEX15Z6UJ#PMVVY #Pension #FinancialSecurity pic.twitter.com/WOGJIRdTwU
— DFS (@DFS_India) July 22, 2020
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.