‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’.. పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రారంభించారు. అట్టడుగు వర్గాల వారికి .. బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్న ఆశయంతో ఈ పథకం మొదలైంది. ఈ పథకం లబ్ది దారులలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలే కావడం విశేషం.
జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతా ఓపెన్ చేయాలి అనుకున్న వారు.. ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ లేదా బిజినెస్ కరస్పాండెంట్ (బ్యాంక్ మిత్ర) అవుట్‌లెట్‌లో ఈ ఖాతాను తెరవవచ్చు. జన్ ధన్ ఖాతా ఉన్నవారు.. ఇందులో ఎటువంటి బ్యాలెన్స్ ఉంచనవసరం లేదు. అంతేకాదు.. అర్హత ఉన్న ఖాతాదారులకు పదివేల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తోంది. అంటే.. మీ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా.. పదివేలు వరకు విత్‌డ్రా చేసుకోవచ్చన్నమాట. ఈ పథకం కింద అకౌంట్ ఓపెన్ చేసిన వారికి.. రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.30 వేల జీవిత బీమా వంటి సౌకర్యాలు అదనం.
ఇది కూడా చదవండి: పొరపాటున వేరే అకౌంట్ కు డబ్బులు పంపితే ఏం చేయాలి..?
స్వాతంత్య్రం సంవత్సరం వచ్చిన మొదటి 67 ఏళ్లలో.. అంటే 2014 వరకు జనాభాలో 50 శాతానికి కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో చోటు లేదు. కానీ జన్ ధన్ యోజన వచ్చిన తర్వాత కోట్లాది మంది పౌరులు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యమయ్యారు. ఇందులో 55 శాత మంది మహిళలే. అంతేకాక ఈ అకౌంట్లలో లక్షన్నర కోట్లకు పైగా డిపాజిట్ అయ్యాయి. జన్ ధన్ ఖాతాకు బీమా సౌకర్యం కూడా ఉంటోంది. అంటే ఖాతాదారులకు అనుకోని ప్రమాదం ఏమైనా జరిగితే బీమా రక్షణ పొందుతారు. అంతేకాక ప్రభుత్వ స్కీమ్‌ల ప్రయోజనాలన్ని నేరుగా ఈ అకౌంట్ల ద్వారా ప్రజల చెంతకే చేరుతున్నాయి.
Serving the unserved has been the mantra of PM @narendramodi ji’s welfarism. #PMJDY, #Mudra, #DBT, & #DigitalIndia have been instrumental in removing financial untouchability, ensuring last mile delivery of benefits and are also enablers in transforming lives. #SamajikNyay pic.twitter.com/muHrWipckO
— Dharmendra Pradhan (@dpradhanbjp) April 17, 2022
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సర్దుబాటు పథకం (ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన) పేదల ఆర్థిక ప్రగతికి కీలకంగా మారుతోంది.
ఇప్పటి వరకు 45.11 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాల్లో రూ.1.67 లక్షల కోట్లు జమ.#PMJDY#SamajikNyay pic.twitter.com/4XCTnURjJu
— మధుకర్ / Madhukar / मधुकर (@BJPMadhukarAP) April 17, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.