SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఐపీఎల్ 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Ppf Scheme Invest Rs 417 Daily After 25 Years Will Get Crore Rupees

అద్భుతమైన పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి రాబడి!

కోటీశ్వరులు అవ్వాలని కలలు కంటే సరిపోదు.. అందుకు అనుగుణంగా ఆదాయం ఉండాలి. పోనీ, అలా ఆదాయం ఉన్నంత మాత్రాన ఒక్కనెలలోనో.. ఒక్క ఏడాదిలోనో కోటీశ్వరులు అవ్వడం అసాధ్యం. అందుకున్న ఏకైక సురక్షిత మార్గం.. 'పొదుపు'. నెలనెలా కొంత మొత్తంలో పొదుపు చేస్తూ పోతే కొన్నేళ్ళకు కోటి రాబడిని నిజంగానే పొందవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం..

  • Written By: Govardhan Reddy
  • Updated On - Tue - 21 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అద్భుతమైన పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి రాబడి!

మీకు పొదుపు చేయాలన్న ఆలోచన ఉంటే చాలు.. మిమ్మల్ని ధనవంతులను చేసే అనేక పథకాలు పోస్టాఫీస్ లో అందుబాటులో ఉన్నాయి.  అందులోనూ.. మార్కెట్ పరిస్థితులకు ప్రభావితం కాకుండా సురక్షితమైన రాబడి అందాలంటే పోస్టాఫీస్ పథకాలు ఎంతో నమ్మదగినవి కూడాను. పోస్టాఫీస్ అందిస్తోన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీమ్ కూడా అచ్చం అలాంటిదేనని చెప్పుకోవాలి. ఈ స్కీమ్ లో దీర్ఘకాలం పొదుపు చేస్తే.. పెద్ద మొత్తంలో రాబడి పొందవచ్చు. అందులోనూ..ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితం. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ద్వారా అస్సలు ప్రభావితం కాదు. దీని వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతమున్న సురక్షిత పెట్టుబడి పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అతిముఖ్యమైనది. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన దీర్ఘకాలిక పథకం కూడాను. ఎందుకంటే దీనికి కేంద్ర ప్రభుత్వం భరోసా ఉంటుంది. ఈ పీపీఎఫ్ ఖాతాను 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా ఏదేని బ్యాంకు లేదా పోస్టాఫీసులో తెరవచ్చు. ఖాతా తెరవడానికి గరిష్ట వయో పరిమితి అంటూ లేదు. కాకుంటే.. ఒక వ్యక్తి ఒక ఖాతానే తెరవాల్సి ఉంటుంది. ఇండివిడ్యువల్ అకౌంట్ తెరవడానికి మాత్రమే వీలుంటుంది. జాయింట్ ఖాతా సౌకర్యం లేదు. పైగా ఈ పథకంలో ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

కనీస పెట్టుబడి ఏడాదికి రూ. 500

కనీసం రూ. 100 డిపాజిట్ చేయడం ద్వారా పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చు. అయితే ఖాతా ఓపెన్ చేశాక.. కనీసం ఏడాదికి రూ. 500 అయినా పొదుపు చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకూ డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదికి ఒకసారి లేదా నెలకొకసారి చొప్పున 12 నెలలు పెట్టుబడి మొత్తాన్ని కట్టుకోవచ్చు. నిబంధనల ప్రకారం.. ఈ పథకం లాకిన్ పీరియడ్.. 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకా కొనసాగాలి అనుకుంటే.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి దీనిని పొడిగించుకోవచ్చు. ఇలా అపరిమిత కాలానికి ఈ స్కీమ్ ను పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించుకుంటూనే అధిక మొత్తంలో రాబడి పొందవచ్చు.

dsave amount

రోజుకు రూ. 417 పొదపుతో.. కోటి ఆదాయం!

ఈ పథకం ద్వారా మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే.. మెచ్యూరిటీ కాలవ్యవధి(15 సంవత్సరాల) తర్వాత స్కీమ్ ను 5 సంవత్సరాల కాలానికి రెండుసార్లు పెంచుకోవాలి. అంటే.. మీ పెట్టుబడి కాలవ్యవధి 25 ఏళ్లుగా మారుతుంది అన్నమాట. ఉదాహరణకు.. మీరు రోజుకు రూ. 417 లేదా నెలకు రూ.12,500 చొప్పున 15 ఏళ్లపాటు పొదుపు చేశారనుకోండి.. మెచ్యూరిటీపై మొత్తం రూ.40.68 లక్షలు పొందుతారు. ఇందులో.. మీ మొత్తం పెట్టుబడి రూ. 22.50 లక్షలు కాగా, వడ్డీ రూపంలో రూ. 18.18 లక్షలు మీకు ఆదాయం లభిస్తుంది.

ఇప్పుడు మెచ్యూరిటీ కాలవ్యవధిని మరో రెండు మార్లు 5 సంవత్సరాల కాలానికి పెంచుకుంటే.. 25 సంవత్సరాల తర్వాత మీ మొత్తం కార్పస్ రూ. 1.03 కోట్లు అవుతుంది. ఈ కాలంలో మీ మొత్తం పెట్టుబడి రూ. 37.50 లక్షలు కాగా, వడ్డీ రూపంలో రూ. 65.58 లక్షలు మీకు అందుతుంది. అంటే ఒక వ్యక్తి తాను 30 సంవత్సరాల వయస్సులో ఈ పథకాన్ని ప్రారంభిస్తే.. అతడు రిటైర్మెంట్(55) అయ్యే సమయానికి కోటి రూపాయలు అందుతాయి. పైగా ఈ పథకంలో ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ పథకంలో సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితమైనవి. ప్రస్తుతం పీపీఎఫ్ పథకంపై 7.10 శాతం వార్షిక వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తారు.

గమనిక: పీపీఎఫ్ ఖాతాను పొడిగించాలనుకుంటే, మెచ్యూరిటీకి ఒక సంవత్సరం ముందుగానే దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగించటం కుదరదు. అలాగే, వడ్డీ రేట్ల మార్పులకు అనుగుణంగా రాబడి మొత్తం ఉంటుంది. గుర్తుంచుకోగలరు.

Tags :

  • business news
  • post office
  • Post Office Saving Schemes
  • PPF scheme
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ ఏరియాలో ప్లాట్ రూ.15 లక్షలు! ఇప్పుడు కొంటే ఊహించని లాభాలు!..

ఈ ఏరియాలో ప్లాట్ రూ.15 లక్షలు! ఇప్పుడు కొంటే ఊహించని లాభాలు!..

  • ఏపీలో పెరగనున్న భూముల ధరలు.. ఈ ఏరియా వాసులకు లాభాల పంట!

    ఏపీలో పెరగనున్న భూముల ధరలు.. ఈ ఏరియా వాసులకు లాభాల పంట!

  • సాఫ్ట్‌వేర్ జాబ్ కాదని గోలి సోడా బిజినెస్.. నెలకు 30 లక్షలు పైనే సంపాదన.. 4 కోట్ల టర్నోవర్

    సాఫ్ట్‌వేర్ జాబ్ కాదని గోలి సోడా బిజినెస్.. నెలకు 30 లక్షలు పైనే సంపాదన.. 4 కోట్ల టర్నోవర్

  • Gold: 90 రోజుల కనిష్టానికి బంగారం ధర! ఇప్పుడు కొంటే లాభం పక్కా!

    90 రోజుల కనిష్టానికి బంగారం ధర! ఇప్పుడు కొంటే లాభం పక్కా!

  • సౌత్ HYDలోని ఈ ఏరియాలో రూ. 20 లక్షల్లోపే ప్లాటు, ఫ్లాటు!

    సౌత్ HYDలోని ఈ ఏరియాలో రూ. 20 లక్షల్లోపే ప్లాటు, ఫ్లాటు!

Web Stories

మరిన్ని...

చీర కట్టులో వయ్యారాలు వడ్డిస్తున్న కృతి శెట్టి
vs-icon

చీర కట్టులో వయ్యారాలు వడ్డిస్తున్న కృతి శెట్టి

ఈగో గురించి మీకు తెలియని నిజాలు!
vs-icon

ఈగో గురించి మీకు తెలియని నిజాలు!

జిమ్‌కి వెళ్లకుండా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి!
vs-icon

జిమ్‌కి వెళ్లకుండా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి!

మహిళల భద్రత కోసం ఎలక్ట్రిక్ చెప్పులు.. చేయి వేస్తే కరెంట్ షాకే!
vs-icon

మహిళల భద్రత కోసం ఎలక్ట్రిక్ చెప్పులు.. చేయి వేస్తే కరెంట్ షాకే!

ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 30 వేల జీతం!
vs-icon

ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 30 వేల జీతం!

ఘాటు అందాలతో సెగలు రేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్
vs-icon

ఘాటు అందాలతో సెగలు రేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్

అందానికే అసూయ కలిగించే అందం అనసూయ సొంతం!
vs-icon

అందానికే అసూయ కలిగించే అందం అనసూయ సొంతం!

అంబులెన్స్‌పై AMBULANCE అక్షరాలు తిరగేసి ఉంటాయి! ఎందుకంటే..
vs-icon

అంబులెన్స్‌పై AMBULANCE అక్షరాలు తిరగేసి ఉంటాయి! ఎందుకంటే..

తాజా వార్తలు

  • తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు కూడా!

  • 'ఏజెంట్' OTT రిలీజ్ ఎందుకింత లేట్.. కారణం అదేనా?

  • IPL ఐదో కప్ కొట్టిన ఆనందం.. ఫస్ట్ టైమ్ అలా చేసిన CSK‌!

  • బ్రేకింగ్: భారీ అగ్ని ప్రమాదం.. షోరూంలో 50 కార్లు దగ్ధం..

  • మే 31 నిర్జల ఏకాదశి! లక్ష్మీదేవి తప్పక కరుణించే రోజు! ఇలా చేయండి!

  • రోడ్డు ప్రమాదంలో మంత్రికి తీవ్ర గాయాలు!

  • మహిళలకు బంపర్ ఆఫర్.. టికెట్ లేదు.. ఉచిత బస్సు ప్రయాణం..

Most viewed

  • లగ్జరీగా కనిపించే ఈ ఇంటిని 5 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!

  • సన్ రైజర్స్ టీంలోకి జడేజా? రీజన్ ఇదే..

  • ఈ పాపని గుర్తుపట్టారా? హీరోయిన్‌గా కంటే పోలీస్‌తో గొడవ వల్ల ఫేమస్!

  • పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు 29 వేల వరకూ జీతం!

  • OTTలోకి రేపు ఒక్కరోజే 26 మూవీస్.. కొత్తగా అవి కూడా!

  • ఆ13 కుటుంబాలకు శరత్ బాబు ఆస్తులు? మాల్స్, విల్లాలు, అపార్ట్మెంట్స్!

  • OTTలోకి డైరెక్ట్‌గా విశ్వక్‌సేన్ కొత్త సినిమా.. ఐదుగురు హీరోయిన్స్‌తో!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam