భారతీయ తపాల వ్యవస్థ ప్రజలకు అనేక సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలకు కోసం కొన్ని పథకాలను సైతం అమలు చేస్తుంది. ఇప్పటికి ప్రజలు.. తమ డబ్బును పొదుపు చేసుకునేందుకు పోస్టాఫీసులో వివిధ రకాల పథకాలు అమలులో ఉన్నాయి. తాజాగా ప్రజల కోసం పోస్టాఫీసు మరో ప్లాన్ అమలు చేస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ కింద వచ్చే ఈ ప్లాన్ పేరు “యుగల్ సురక్ష”. ఈ ప్లాన్ లో మీరు ప్రతి నెలా రూ. 2201 అంటే రోజుకు దాదాపు 70 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా రూ. 10 లక్షల కంటే ఎక్కువ మెచ్యూరిటీని పొందవచ్చు. వివరాల్లోకి వెళ్తే..
యుగల్ సురక్ష ప్లాన్ లో భాగంగా.. నెలకు రూ.2201 కడుతుంటే.. రూ.10 లక్షల బెనిఫిట్ పొందవచ్చు. ఇక్కడ ప్రత్యేక ఏమిటంటే.. భార్యాభర్తలకు కలిపి కవరేజీ ఇచ్చే ప్లాన్ ఇది. అంటే భార్యాభర్తలిద్దరూ ఒకే ప్లాన్‌లో కవర్ అవుతారు. పాలసీ తీసుకున్న భార్యభర్తలు.. ఇద్దరూ జీవిత బీమా ప్రయోజనం పొందుతారు. యుగల్ సురక్ష అని పిలిచే ఈ పాలసీలో, మెచ్యూరిటీపై మొత్తం హామీ, బోనస్ అందిస్తారు. పాలసీ సమయంలో జీవిత భాగస్వాముల్లో ఒకరు మరణిస్తే.. బీమా మొత్తం, బోనస్‌తో కలిపి ప్రయోజనం అందిస్తారు.
అయితే ఈ పాలసీని ప్రతి ఒక్కరూ తీసుకోలేరు. కానీ, చాలా మంది ప్రజలు దీనిని తీసుకోవడానికి అర్హులు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెమీ ప్రభుత్వ ఉద్యోగులు, లిస్టెడ్ కంపెనీ ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లు,న్యాయవాదులు లేదా బ్యాంకర్లు, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల ఉద్యోగులు ఈ ప్లాన్‌ని తీసుకోవచ్చు. 21 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.
ఉదాహరణకు ఓ వ్యక్తి, అతని భార్య ఇద్దరికి కలిపి రూ.5 లక్షల హామీతో పోస్టాపీసులో “యుగల్ సురక్ష” ప్లాన్ భాగంగా 20 ఏళ్ల ప్రీమియం తీసుకున్నారు. సదరు వ్యక్తి ఈ ప్రీమియం కోసం ప్రతి నెలా రూ.2201 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా 20 ఏళ్ల పాలసీ సమయంలో ఆ వ్యక్తి రూ.5,28,922 చెల్లిస్తాడు. 20 ఏళ్లు పూర్తయిన తర్వాత అతని పాలసీ మెచ్యూర్ అవుతుంది.
మెచ్యూరిటీ అయిన తర్వాత, ఆ వ్యక్తి కి ముందుగా రూ. 5,00,000 హామీ మొత్తంతోపాటు రూ. 5,20,000 బోనస్ అందుతుంది. ఈ విధంగా ఆ వ్యక్తి మొత్తం రూ.10,20,000 వస్తుంది. ఈ విధంగా ఆ దంపతులు 20 ఏళ్ల పాలసీలో మొత్తం రూ.5,28,922 చెల్లించగా, మెచ్యూరిటీపై రెట్టింపు ప్రయోజనం పొందాడు. దీంతో పాటు ఆ దంపతులకు జీవిత బీమా ప్రయోజనం కూడా లభించింది. మరి.. ఈ పాలసీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IRCTC: ఈ బిజినెస్ ఎంచుకుంటే.. రైల్వే నుంచి నెలకు రూ.80 వేల ఆదాయం పక్కా.. !
ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఆగష్టులో 13 రోజులు బ్యాంకులు క్లోజ్! ఏయే రోజు అంటే..