మీ పిల్లల భవిష్యత్ గురుంచే మీ ఆలోచనా.. అయితే, ఈ పాలసీ గురించి తెలుసుకోవాల్సిందే. మీ బిడ్డ పేరుపై రోజుకు రూ. పొదుపు చేస్తూ లక్ష రాబడిని పొందవచ్చు. ఎలా..? ఈ పథకం ఏంటి..? ప్రయోజాలేంటి..? అన్న వివరాలు తెలుసుకోవాలంటే కింద చదవాల్సిందే..
సాధారణంగా జీవిత బీమా అంటే వయసు పైబడిన వారికి ప్రయోజకరం అన్నది ప్రజలలో ఉన్న భావన. అది వాస్తవం కాదు. చిన్నారుల జీవితాలకు భరోసానిచ్చే ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఇండియన్ పోస్టాఫీస్ అందిస్తోన్న ‘బాల్ జీవన్ బీమా’ ఒకటి. ఈ పథకంలో రోజుకు కేవలం రూ. 6 పొదుపు పెడుతూపోతే మెచ్యూరిటీ సమయంలో రూ. లక్ష రాబడిని పొందవచ్చు. ఇంతకీ ఈ పథకానికి ఎవరు అర్హులు..? పాలసీని ఎలా పొందాలి..? ఎంత మాది పిల్లలపై ఈ పాలసీ తీసుకోవచ్చు..? వంటి సంక్షిప్త వివరాలు మీకోసం..
తమ పిల్లలు ఉన్నత స్థాయిలో స్థిర పడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకునేదే. మంచి చదువు అందించడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు. ఇక పెళ్లిళ్లు వంటి ఇతర సందర్భాల్లో ఒక్కోసారి లక్షల రూపాయలు కావాల్సివస్తుంటాయి. సరైన ఆర్థిక ప్రణాలిక లేకుంటే అలాంటి పరిస్థితుల్లో నానా అవస్థలు పడాల్సివుంటుంది. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, ముందస్తు ప్రణాళిక అవసరం. పిల్లలు పుట్టినప్పటి నుంచి అలాంటి ఆలోచన చేయాలి. అవి వారి భవిష్యత్ కే భరోసానిస్తాయి. ఇప్పుడు చెప్తున్న పథకం లక్షలు, లక్షలు వెనకేయకున్నప్పటికి.. మధ్యతరగతి వారికి మంచి పథకమనే చెప్పాలి.
‘బాల్ జీవన్ బీమా’ పథకం కింద రోజుకు కనిష్టంగా రూ. 6, గరిష్టంగా రూ.18 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 45 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులు తమ పిల్లల పేరుతో ఈ పథకంలో పొదుపు ప్రారంభించాల్సివుంటుంది. ఈ పథకం కింద కుటుంబంలోని ఇద్దరు పిల్లలు ప్రయోజనం పొందవచ్చు. 5 నుంచి 20 ఏళ్లలోపు పిల్లలు ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకం కింద ప్రీమియం.. నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన నగదు జమ చేయవచ్చు. పెద్ద మొత్తంలో పొదుపు చేయాలనే వారు కనీసం రోజుకు రూ.6 పొదుపు చేయడం ద్వారా మెచ్యూరిటీపై రూ. ఒక లక్ష వరకు రాబడి పొందవచ్చు. ఈ పథకంలో మీకు రూ. 1000 హామీ మొత్తంపై ప్రతి సంవత్సరం రూ. 48 బోనస్ కూడా అందుతుంది.