‘ధనం మూలం ఇదం జగత్తు’.. ‘పైసామే పరమాత్మ’.. ఇలాంటి చాలా సామెతలు మనం వినే ఉంటాం. అదీ కాక ఈ రోజుల్లో ఎంత సంపాదించినా గానీ.. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగట్లేదు అన్నదే చాలా మంది బాధ. ఈ క్రమంలోనే పెరుగుతున్న ఖర్చులను భరించడానికి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు నేటి యువత. అలాంటి వారికి అద్భుత అవకాశాలు కల్పిస్తున్నాయి పోస్టాఫీస్ స్కీమ్ లు. నెల నెల కొద్ది మెుత్తాల పొదుపుతో లక్షల్లో, కోట్లల్లో రాబడిని పొందొచ్చు. అయితే మనం పోస్టాఫీస్ స్కీముల్లో నెలనెలా చిన్న మెుత్తాల్లో పెట్టుబడి పెడితే చివరికి మీకు పెద్ద మెుత్తంలో రాబడి అందుతుంది. అలాంటి ఉత్తమమైన స్కీమే ‘పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)’.
పోస్టాఫీస్.. చాలా మంది దీన్ని ఉత్తరాలు చేరవేసే ఓ మునిగిపోయే టైటానిక్ అని అనుకుంటారు. అదీ కాక చాలా మంది పోస్టాఫీస్ ను చిన్న చూపు చూస్తారు. దాంతో అటువైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ ఓ సారి మీరు పోస్టాఫీస్ అందించే స్కీమ్ ల గురించి తెలుసుకుంటే? ఆ స్కీమ్ లను వదిలిపెట్టరు. ప్రస్తుతం ఉన్న కార్పోరేట్ నకిలీ ప్రపంచంలో ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియక చాలా మంది తమ డబ్బును కోల్పోతుంటారు. అలా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇండియన్ పోస్టాఫీస్ అద్భుతమైన స్కీమ్ ను అందిస్తోంది. పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో నెల నెల కొద్ది మెుత్తంలో ఇన్వెస్ట్ చేస్తే మీరు కోటీశ్వరులు కావొచ్చు. అదీకాక పోస్టాఫీస్ కు ప్రభుత్వం మద్ధతు కూడా ఉంటుంది. దాంతో మీకు డబ్బును కోల్పోతాం అన్న భయం కూడా ఉండదు.
ఈ స్కీమ్ లో సంవత్సారానికి మీరు చేసే ఇన్వెస్ట్ పై 7.1 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. అదీకాక ఈ వడ్డీ రేట్లను కేంద్రం ప్రతీ మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంది. ఇక మీరు ఈ PPF అకౌంట్ లో సంవత్సరానికి కేవలం రూ. 1.5 లక్షల చొప్పున డిపాజిట్ చెయ్యాలి. అంటే నెలకు దాదాపు రూ.12-13 వేల వరకు కట్టాల్సి ఉంటుంది. ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. ప్రస్తుతం అందిస్తున్న 7.1 శాతం వడ్డీ రేటుతో 25 సంవత్సరాల్లో మీరు రూ 1.03 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఈ పీపీఎఫ్ అకౌంట్ ను మీరు ఏ పోస్టాఫీస్ లోనైనా తీసుకోవచ్చు. ఈ అకౌంట్ పై ఎన్నో రకల లోన్లు సైతం మనం పొందొచ్చు. మీరు PPF ఖాతా తెరిచిన సంవత్సరానికే లోను కు అర్హులు అవుతారు. దాంతో ఐదు సంవత్సరాల వరకు మీరు ఎక్కడైనా లోను తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పైగా ఈ డబ్బులకు పన్ను మినహాయింపు సైతం లభిస్తుంది. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మంచి రాబడి సంపాదించుకోవాలను కునే వారికి ఈ పోస్టాఫీస్ పీపీఎఫ్ స్కీమ్ ఒక కల్పతరుణి లాంటిది.