నెల నెలా ఎంతో కొంత డబ్బులు వస్తుంటే.. తమకు ఏదో విధంగా ఉపయోగపడతాయి కదా అని ఆలోచించే వారు ఈరోజుల్లో చాలా ఎక్కువ. అలాంటి వారికోసం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనే పొదుపు పథకాన్ని అందిస్తోంది. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం వస్తూనే ఉంటుంది. ఈ ఖాతా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు..
మీరు ఏదైనా దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి ఈ పొదుపు ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం కింద కనిష్టంగా రూ.1000, నుంచి గరిష్టంగా రూ.4.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ ఖాతాలో అయితే.. రూ. 9 లక్షల వరకు జమ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకం కింద వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. మీ పిల్లల వయస్సు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే మీరు అతని పేరు మీద ఈ ఖాతాను తెరవవచ్చు. ఒకవేళ తక్కువగా ఉంటే పిల్లాడికి బదులు తల్లిదండ్రులు ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ 5 సంవత్సరాలు. అయితే కొన్ని సందర్భాల్లో మెచ్యూరిటీ కాలం పూర్తి కాకముందే డబ్బు వెనక్కు తీసుకోవచ్చు. అయితే వడ్డీ రేటు తగ్గుతుంది. అంటే వచ్చే రాబడి తగ్గిపోతుంది. అందుకే ఒక్కసారి డబ్బులు పెడితే ఐదేళ్ల వరకు తీసుకోకుండా ఉండటమే మంచిది.
ఇది కూడా చదవండి: అంబానీ మనవడైనా బడికి వెళ్లాల్సిందేనా..!ప్రస్తుతం మీ పిల్లల వయస్సు 10 సంవత్సరాలు అనుకుంటే.. మీరు అతని పేరు మీద రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా మీ వడ్డీ ప్రస్తుత 6.6 శాతం ప్రకారం రూ.1100 అవుతుంది. ఐదేళ్లలో ఈ వడ్డీ మొత్తం 66 వేల రూపాయలు అవుతుంది. చివరిగా మళ్లీ మీ 2 లక్షల రూపాయల తిరిగి పొందుతారు. ఈ విధంగా చిన్న పిల్లల కోసం, వారి చదువు కోసం ఉపయోగించగల 1100 రూపాయలు పొందుతారు. ఈ మొత్తం తల్లిదండ్రులకు మంచి సహాయంగా ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాల కోసం ఈ సైట్ ని సంప్రదించగలరు.