పేద, మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉన్న మనదేశంలో సామజిక భద్రత పథకాలపై ఆసక్తి ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచించి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకం. అంటే పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. కేవలం ఏడాదికి రూ. 20 ప్రీమియంతో భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది. ఆ వివరాలు..
కుటుంబానికి పెద్దగా ఉన్న వ్యక్తి అనుకోకుండా ప్రాణాలు కోల్పోతే.. ఆకుటుంబం రోడ్డున పడుతుంది. భవిష్యత్ పై ఆశలు కోల్పోతుంది. అందునా.. రాను రాను రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా అందించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యెజన (PMSBY) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరే వ్యక్తి ఏడాదికి రూ. 20 డిపాజిట్ చేయడం ద్వారా రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనాలను పొందవచ్చు.
ఎవరు అర్హులు?
18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ పథకానికి అర్హులు. బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడితే సరిపోతుంది. ప్రీమియం కట్ చేసుకొని పాలసీ అందిస్తారు. ఈ పథకంలో చేరిన తర్వాత ఆటోడెబిట్ ఫెసిలిటీ యాక్టివేట్ చేసుకోవడం ఉత్తమం. ఆలా చేసుకున్నట్లయితే.. ప్రతి సంవత్సరం రూ.20 బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా కట్ అయ్యి.. భీమా కంటిన్యూ అవుతుంటుంది.
కావాల్సిన డాక్యుమెంట్లు..
ప్రయోజనాలు..
ఈ పథకంలో లబ్ధిదారులు ఎవరైనా రోడ్డు ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా.. మృతుడి కుటుంబ సభ్యులకు రూ. 2,00,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఒకవేళ ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తారు.
క్లెయిమ్ చేసే విధానం..
లబ్ధిదారుడు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే ఆ వ్యక్తి యొక్క నామినీ బ్యాంకు లేదా బీమా కార్యాలయానికి వెళ్లి క్లెయిమ్ ఫారమ్‌ను పూర్తిచేయాలి. బీమా చేయబడిన వ్యక్తి తన పొదుపు ఖాతాను కలిగి ఉన్న బ్యాంకు శాఖలో బీమా చేయబడిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీమా కవర్ మొత్తం నామినీ ఖాతాలోకి బదిలీ అవుతుంది.
ప్రమాదాలు ఎప్పుడు ఏ ఎలా జరుగుతాయో తెలీదు. ఎలాంటి పరిస్థితులు సంభవించినా వాటిని ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలి. అందుకే జీవిత బీమా, ఆరోగ్య బీమాతోపాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకుంటే ఉత్తమం. ఈ పాలసీపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Invest in a social security scheme with a promise of protecting your loved ones with Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana & Pradhan Mantri Suraksha Bima Yojana. Know more: https://t.co/DkL4wR2A2v https://t.co/LkSzZeJOqG #DFS#UnionBankOfIndia #AmritMahotsav @DFS_India pic.twitter.com/1xD18eh9k1
— Union Bank of India (@UnionBankTweets) September 13, 2022