వ్యవసాయంలో ట్రాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ ను అద్దె కోసం తెచ్చుకుంటారు. కానీ గంటకు ఇంత అని చెప్పి కొంతమంది ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు రైతులకు నరకం చూపిస్తుంటారు. దీంతో రైతుల డబ్బంతా మన్నులో పోసినట్టే అవుతుంది. రైతుకి కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, సొంతంగా ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే బాగుణ్ణు అని. కానీ ట్రాక్టర్ కొనాలంటే ఆర్థిక స్థోమత చాలదు. అయితే అలాంటి రైతుల కోసం ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. సగం ధరకే ట్రాక్టర్ ని కొనేందుకు సబ్సిడీ ఇస్తోంది.
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఎక్కువ శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారు. అయితే ప్రస్తుతం పెరిగిపోయిన వ్యవసాయ ఖర్చుల కారణంగా వ్యవసాయం భారంగా మారింది. దీంతో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు పలు పథకాల పేరుతో రైతులకు ప్రయోజనం చేకూరుతున్నాయి. అయితే రైతులను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం మరో పథకాన్ని అమలులోకి తెచ్చిందన్న విషయం చాలా మందికి తెలియదు. పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు సగం ధరకే ట్రాక్టర్ ని అందజేస్తుంది.
ఈరోజుల్లో వ్యవసాయం అంటే ఖచ్చితంగా ట్రాక్టర్ తో పని ఉంటుంది. దుక్కి దున్నడం నుంచి పంటను తరలించే వరకూ ట్రాక్టర్ తో అనేక అవసరాలు ఉంటాయి. అయితే రైతులకు ట్రాక్టర్ కొనుగోలు చేయాలంటే కష్టంతో కూడుకున్న పని. ట్రాక్టర్ కొనాలంటే కనీసం 6 లక్షల రూపాయలు ఉంటుంది. అయితే కేంద్రం ఈ ట్రాక్టర్ కొనుగోలు కోసం 20 నుంచి 50 శాతం సబ్సిడీ ఇస్తుంది.
దీంతో అర్హత ఉంటే రైతులు సగం ధరకే ట్రాక్టర్ ను సబ్సిడీలో పొందవచ్చు. ఎవరైనా రైతులు పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం కింద ట్రాక్టర్ ను కొనుగోలు చేస్తే సబ్సిడీ వస్తుంది. దీని కోసం రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైతే సబ్సిడీ డబ్బులు రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తుంది. ఈ పథకానికి ఆఫ్ లైన్ లో లేదా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సమీప కామన్ సర్వీస్ సెంటర్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
మరి పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం కింద 20 నుంచి 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్ ని కొనుగోలు చేసే అవకాశాన్ని రైతులు వినియోగించుకోగలరు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులకు సగం ధరకే ట్రాక్టర్ ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ పథకం దేశంలో ఉన్న సన్నకారు రైతులందరికీ వర్తిస్తుంది. ఈ విషయాన్ని ప్రతీ రైతుకు తెలిసేలా షేర్ చేయండి. అలానే రైతుల కోసం ఆలోచించి సబ్సిడీ మీద ట్రాక్టర్ ని అందిస్తున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.