రైతులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అన్నదాతల ఖాతాల్లో 4 వేలు జమకానున్నాయి. అయితే అందరికి కాదు.. కొందరు రైతులు మాత్రమే 4 వేల రూపాయలు పొందగలరు. ఎందుకు అంటే..
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు వారి ఖాతా ద్వారా ఒకే సారి 4 వేల రూపాయలు పొందే అవకాశం కల్పించింది. మరి రైతులందరి ఖాతాల్లో ఈ మొత్తం జమ చేస్తుందా.. ఎవరు దీనికి అర్హులు వంటి వివరాలు.. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో చేరిన అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 6 వేల రూపాయలు అందజేస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా లభిస్తాయి. ఏడాదికి మూడు విడతల రూపంలో రైతుల బ్యాంక్ అకౌంట్‌లోకి పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ. 2 వేలు చొప్పున మొత్తంగా రూ. 6 వేలు జమచేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే 13 విడతల డబ్బులను రైతులకు అందించింది. త్వరలోనే 14వ విడత డబ్బులు రావాల్సి ఉంది.
అయితే కొంత మంది రైతులు మాత్రం రూ. 4 వేలు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇలా.. ఎవరు అర్హులు అంటే.. ఎవరికైతే 13 వ విడత కింద రూ. 2 వేలు పొందలేదో.. వారికి తదుపరి విడత కింద రూ. 4 వేలు లభించే ఛాన్స్ ఉంటుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే చాలా మందికి బెనిఫిట్ కలుగుతుంది. ఎందుకంటే.. 13వ విడత కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదల చేసినప్పుడు.. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోని రైతులకు ఆ విడత డబ్బులు నిలిచిపోయాయి అని అధికారులు తెలిపారు. దాని వల్ల వారి ఖాతాలో రెండు వేలు జమ కాలేదు.
గతంలో వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి కాకపోవడంతో నిలిచిపోయిన వారి.. ఇప్పుడు ఆ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారు. అందువల్ల ఇలాంటి వారికి 14వ విడత కింద రూ. 4 వేలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక త్వరలోనే 14 వ విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల కానున్నాయి. మరి తమకు ఈ మొత్తం వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం రైతులు.. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ లబ్ధిదారుల జాబితా ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ వంటివి ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు మీ ప్రాంతానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా వస్తుంది. ఇందులో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
ఇక ఈ ఏడాది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత డబ్బులు ఏప్రిల్-జూలై మధ్య కాలంలో రైతుల బ్యాంక్ ఖాతాలోకి చేరనున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 11వ విడత డబ్బులు మే 31న రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడింది. అయితే ఈసారి మాత్రం త్వరలోనే పీఎం కిసాన్ 14 వ విడత డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలోకి చేరే అవకాశం ఉంది. ఈసారి మే 15 నాటికి ప్రభుత్వం రైతుల ఖాతాలకు పీఎం కిసాన్ డబ్బులను జమ చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. మరి మీకు 13వ విడత డబ్బులు రాకపోయి ఉండి.. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకుని ఉంటే.. ఈ సారి మీ ఖాతాలో 4 వేల రూపాయలు పడే అవకాశం ఉంది.