కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఒకటి. అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింది ప్రతి ఏటా రైతులకు రూ. 6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక్కసారి రూ.2 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమా చేస్తారు. ఇప్పటికే 12 విడతలుగా రూ.24 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే 12వ విడత డబ్బులు కొందరి ఖాతాల్లో మాత్రం జమ కాలేదని తెలుస్తోంది. అలాంటి వారుఎవరైనా ఉంటే ఈ కింది విధంగా ఫిర్యాదు చేయొచ్చు.
పిర్యాదు చేయడానికి ముందు మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో మరోసారి చెక్ చేసుకోండి. డబ్బులు జమకాకపోవడానికి చాలా కారణాలున్నాయి. పొరపాటు వలన మీ ఆధార్, అకౌంట్ నంబర్‌లోని వివరాలు తప్పుగా ఇచ్చారేమో సరిచూసుకోండి. అందులోనూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ‘ఈ-కేవైసీ’ తప్పనిసరి చేసింది. ఒకవేళ మీరు ఈ-కేవైసీ చేయలేదేమో తెలుసుకోండి. అందుకని మీరు మొదట మీ ప్రాంతంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. మీ సమస్యని చెప్పండి. స్పందించకపోతే హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేయవచ్చు.
ఇప్పుడు మీకు డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుస్తోంది. జమ కానట్లయితే హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కు కాల్ చేయవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, PM కిసాన్ హెల్ప్ డెస్క్ (PM KISAN హెల్ప్ డెస్క్) pmkisan ict@gov.in మెయిల్ ద్వారా సంప్రదించ వచ్చు. ఇలా మీ సమస్యను వారికి వివరించి డబ్బులు పొందే అవకాశం వుంది. ప్రత్యామ్నాయంగా, ఈ క్రింది ఫోన్ నంబర్‌లను కూడా కాల్ చేయవచ్చు.
పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266
పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్: 155261
పీఎం కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు: 011-23381092, 23382401
పీఎం కిసాన్ యొక్క మరొక హెల్ప్‌లైన్: 0120-6025109
ఈ-మెయిల్ ID: pmkisan-ict@gov.in