హైదరాబాద్ నగరంలో స్థలం కొని, ఇల్లు కట్టాలంటే అసాధ్యం. కనీసంలో కనీసం 60, 70 లక్షలు పెడితేనే గానీ పనవ్వదు. దీని కంటే రూ. 30, 40 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుక్కోవడం బెటర్ అని అనిపిస్తుంది. కానీ సొంత స్థలం ఉంటే దాని విలువ అనేది పెరుగుతుంది కదా. బిల్డింగ్ కట్టడానికి 20, 30 లక్షలు అవుతుంది. దీని విలువ అనేది పెరగదు. అదే స్థలం అయితే విలువ అనేది పెరుగుతుంది. అందుకే స్థలం మీద పెట్టుబడి పెట్టాలని చాలా మంది భావిస్తారు. స్థలం కొనుక్కుని, ఇల్లు కట్టుకోవాలి అని మీరు భావిస్తే కనుక ఇప్పుడు చెప్పుకోబోయే ఏరియా బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ ఏరియాలో 2 బీహెచ్కేకి సరిపోయే స్థలం రూ. 15 లక్షల లోపే దొరుకుతుంది. ఇక ఇంకో 20 లక్షలు వేసుకుంటే ఇల్లు పూర్తైపోతుంది. ఇంకా బాగా కట్టుకోవాలి అనుకుంటే అదనంగా ఒక 10 లక్షలు వేసుకున్నా రూ. 45 లక్షల్లో బ్రహ్మాండమైన ఇల్లు పూర్తైపోతుంది. ఇదే ఇంటిని సిటీలో కట్టాలంటే కోటి రూపాయల పైనే అవుతుంది.
తూర్పు హైదరాబాద్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్, పోచారం, కొత్తపేట్ లాంటి ఏరియాల్లానే బీబీ నగర్ కూడా పెట్టుబడికి అనుకూలం అని చెప్పవచ్చు. ఈ ఏరియా అభివృద్ధి చెందడానికి కావాల్సిన అన్ని అవసరాలు ఇక్కడ ఉన్నాయి. ఉప్పల్ నుంచి 28 కి.మీ., పోచారం నుంచి 17 కి.మీ., బోడుప్పల్ నుంచి 26 కి.మీ. దూరంలో ఉంది బీబీ నగర్. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలు దూరంగా ఉంటాయి. గంటన్నర ప్రయాణం ఉంటుంది. రోజూ 2 నుంచి 3 గంటలు కర్నూలు-కాచిగూడ రైలులో ప్రయాణం చేసే ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు చేసే ప్రయాణంతో పోలిస్తే గంట, గంటన్నర ప్రయాణం తక్కువనే చెప్పవచ్చు.
తెలంగాణకి ఆభరణం అయిన యాదాద్రికి బీబీ నగర్ 20 కి.మీ. దూరంలో ఉంది. నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్, వరంగల్ హైవే, ఏఐఐఎంఎస్, నిమ్స్ వంటి వాటికి చాలా దగ్గరగా ఉండడమే గాక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి 15 నిమిషాల దూరంలో ఉంది. పెట్టుబడిదారులకు అభివృద్ధి చెందే ఏరియాగా అలానే సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే బయ్యర్స్ కి ప్రశాంతమైన ప్రదేశంగా బీబీ నగర్ ఉంది. భవిష్యత్తులో ఈ ఏరియాలో పలు కంపెనీలు, విద్యాసంస్థలు, హాస్పిటల్స్ వంటివి వచ్చే అవకాశం ఉంది. మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఏరియాలో చదరపు అడుగు సగటున రూ. 1350 ఉంది.
1000 చదరపు అడుగుల స్థలం కొనాలనుకుంటే కనుక రూ. 13,50,000 అవుతుంది. ఇంకొంచెం విశాలంగా కావాలనుకుంటే గజం రూ. 12,150 చొప్పున 150 గజాలకు రూ. 18,22,500 అవుతుంది. ఇదే ఏరియాలో చదరపు అడుగు ధరలు రూ. 1100, రూ. 1200, రూ. 1300, రూ. 1400, రూ. 1500 రేంజ్ లో కూడా ఉన్నాయి. అంటే 11 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో స్థలాల ధరలు ఉన్నాయి. ఒక రూ. 15 లక్షలతో స్థలం కొనుక్కుని.. రూ. 20 లక్షల్లో ఇల్లు కట్టుకుంటే సొంతింటి కల నిజమవుతుంది.
గమనిక: మాకు దొరికిన డేటా ఆధారంగా బీబీ నగర్ ఏరియాలో స్థలాల ధరలు ఇవ్వడం జరిగింది. ఈ ధరల్లో మార్పులు అనేవి ఉంటాయి. పెట్టుబడి పెట్టాలన్నా, స్థలాలు కొనాలన్నా గానీ ముందు రియల్ ఎస్టేట్ నిపుణుల సలహాలు, సూచనలు పాటించవల్సిందిగా మనవి. పై కథనం కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం ఇవ్వబడింది. ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టడం పూర్తిగా మీ బాధ్యత మాత్రమే.