ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. మొబైల్ ఫోన్ల వాడకం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది.. దీంతో డిజిటల్ లావాదేవీలు కూడా బాగా పెరిగిపోయాయి.
గత కొంతకాలంగా డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ అగ్రస్థానానికి ఎదిగింది. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలు, మహానగరాలు ఎక్కడ చూసినా నగదురహిత లావాదేవీలే జరుగుతున్నాయి. మరోవైపు ప్రజలను డిజిటల్ చెల్లింపులవైపు మల్లించేందుకు కేంద్రం సైతం గట్టిగానే కృషి చేస్తుంది. దేశంలో యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. చేతిలో డబ్బు లేకున్నా ఒక్క ఫోన్ ఉంటే చాలు అనుకుంటూ మార్కెట్ లోకి వెళ్తున్నారు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి సూపర్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఫోన్‌పే యూజర్లకు గొప్ప శుభవార్త తెలిపింది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం దేశంలో చాలామంది ప్రతి చిన్న అవసరానికి నగదుతో పనిలేకుండా ఆన్ లైన్ చెల్లింపులు చేస్తున్న విషయం తెలిసిందే. మార్కెట్ రంగంలో ప్రతిచోట ఆన్ లైన్ చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. తాజాగా దిగ్గజ యూపీఐ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తెగ సంబరపడిపోతున్నారు. ఫోన్‌పే కొత్త సర్వీసులు తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం ఫోన్‌పే నెలవారి పేమెంట్ ఆప్షన్ కూడా ఆవిష్కరించింది.. దీంతో మంత్లీ పేమెంట్స్ తో కొనుగోలు చేయొచ్చు.
ఈ కొత్త ఆఫర్ ద్వారా రూ. కోటి రూపాయల వరకు కవరేజ్ తో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పరిమితులు లేకుండా హాస్పిటల్ రూమ్స్ పొంతే సౌకర్యం ఉంటుంది. ప్రీ, పోస్ట్ సేల్స్ అసిస్టెన్స్ తో పాటు బోనస్ కవర్ ఆప్షన్ కూడా ఉంది. ఇక ఫోన్‌పే ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయదలచిన వారు యాప్ లోకి వెళ్లి ఇన్సూరెన్స్ సెక్షన్ లోకి వెళ్లి, మీ వివరాలు ఎంటర్ చేస్తే కోట్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన ఆప్షన్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వివరాలు పూర్తిగా పరిశీలించి తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెలవారి కానీ, వార్షికంగా కానీ డబ్బులు చెల్లించుకోవచ్చును. మీరు నచ్చిన ఆప్షన్ ని ఎంచుకొవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు రూ.5 లక్షలకు పాలసీ తీసుకుంటే.. నెలవారి పేమెంట్స్ ఆప్షన్ ఎంచుకుంటే సుమారు రూ.950 వరకు కట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల, ఇద్దరు పిల్లలకు ఈ పాలసీ వర్తిస్తుంది. ఇక కేర్ హెల్త్ ప్లాన్ తీసుకున్నట్లయితే ఈ ప్రీమియం పడుతుంది.ఈ మద్యనే ఫోన్‌పే కొత్త సేవలు తీసుకువచ్చింది. పీఓఎస్ విభాగంలోకి కూడా అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే కొత్త పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) డివైజ్ ని లాంచ్ చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్స్ స్వీకరించడం వల్ల వ్యాపారం మరింత పెరుగుతుందని ఫోన్‌పే ఆఫ్ లైన్ బిజినెస్ హెడ్ తెలిపారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఫోన్ పే కి 3.5 కోట్లకు పైగా మర్చంట్ భాగస్వాములు ఉండగా.. వచ్చే సంవత్సరానికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల డివైజ్ లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఫోన్‌పే మందుకు సాగుతుంది.