జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరమైనది. ఆ డబ్బు అనే ఇంధనం ఎంత ఉంటే జీవితం అనే బండి అంతా హాయిగా ఆగకుండా సాగుతుంది. అయితే అందరికి సంపాదన ఒకేలా ఉండదు. కారణం వారివారి చదువుల్లో వ్యత్యాసలు ఉంటాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఒక విధమైన సంపాదన, పదో తరగతి పాసైన వారు ఓ రకమైన సంపాదన కలిగి ఉంటారు. అయితే ఇలా టెన్త్ పాసైన వారు చాలా మంది ఇంకా అధిక సంపాదన కోసం ఆరాటపడుతుంటారు. అందుకు కూడా బలమైన కారణం ఉంది. చాలి చాలని డబ్బులతో కుటుంబాన్ని ఎంతో కష్టం మీద నెట్టుకొస్తుంటారు. అయితే అలా టెన్త్ పాసై.. అదనపు సంపాదన కోసం చూస్తున్న వారికి మంచి బిజినెస్ ఐడియా ఒకటి ఉంది. మరి.. దాని వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా మీరు మరిన్ని ఆదాయ మార్గాలను వెతుకుతున్నారా?. మీలాంటి వారి కోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)అద్భుతమైన అవకాశం ఇస్తోంది. బిజినెస్ కరస్పాండెంట్స్‌ని ఐపీపీబీ నియమించుకుంటోంది. ఇండివిజ్యువల్ బిజినెస్ కరస్పాండెంట్స్ కోసం ఐపీపీబీ ఆహ్వానం పలుకుతోంది. ఆసక్తిగల వారిని దరఖాస్తులను స్వీకరిస్తోంది. తమ బ్యాంకింగ్ సేవల్ని విస్తరించేందుకు, మరింత మంది వినియోదారులకు సేవలు అందించడం కోసం ఈ బిజినెస్ కరస్పాండెంట్స్‌ని ఐపీపీబీ నియమిస్తోంది. అయితే బిజినెస్ కరస్పాండెంట్ పోస్టులకు పదవి విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అలానే కిరాణా షాపులు, మెడికల్ షాపులు నిర్వహించేవారు, చిన్నమొత్తాల పొదుపు పథకాల ఏజెంట్లు, భీమా పాలసీల ఏజెంట్లు, పెట్రోల్ బంకు యజమానలు అర్హులు. అయితే ఇందుకు కనీస విద్యార్హత పదోతరగతి పాసై ఉంటే చాలు. బిజినెస్ కరస్పాండెంట్ గా పనిచేసేందుకు ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు, తినుబండారాల స్టాల్స్ నిర్వహించేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయాలనుకునే వారు ఐపీపీబీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి. అనంతరం తమ సమాచారం అందులో నింపి అప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్‌గా నియమితులయ్యేవారు బ్యాంకింగ్ సేవల్ని ప్రజలకు అందించాల్సి ఉంటుంది.
ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్ ఎంపికైన తరువాత మీరు అందించే సేవల్ని బట్టి ఐపీపీబీ నుంచి ప్రోత్సాహకాలు ఉంటాయి. ముందుగానే నియమ నిబంధనల్ని అంగీకరించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను సర్కిల్ లేదా బ్రాంచ్ ఆఫీస్‌లో తెలుసుకోవచ్చు. ఇలా మీ పని చేసుకుంటేనే ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్ గా అదనపు ఆదాయం పొందవచ్చు. కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. ఇది 2017లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 650 పైగా ఐపీపీబీ బ్రాంచ్‌లు ఉన్నాయి. బ్యాంకుల అందిస్తున్నట్లుగానే ఐపీపీబీలో సేవలు అందిస్తాయి.