డాక్యుమెంట్లలో ఆధార్, పాన్ ఎంతో ముఖ్యమైనవి. ఆధార్ లేనివి ఏ పనులు జరగవు. ఇప్పటికే.. ప్రభుత్వం ఆధార్ నంబర్ ను ప్రతిదానికి అనుసంధానం చేయాలని హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇక.. పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాల్లో ఇది చాల ముఖ్యమైనది. ఆదాయపు పన్ను శాఖ నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు పాన్ కార్డు కావాల్సిందే. ఇక పాన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరి అయ్యింది. ఇది వరకు ఈ లింక్ చేసుకునేందుకు మార్చి 31, 2022 వరకు గడువు ఉండేది.. ఆ గడువును మరోమారు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కానీ.. గడువు ముగిసింది కనుక ఇప్పుడు లింక్ చేయాలంటే జరిమానా కట్టాలంటోంది.
అంటే.. పాన్ ఆధార్ లింక్ గడువును మరో ఏడాది పాటు పొడిగించారని మీరు అనుకోవచ్చు. అయితే.. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి మీరు మాత్రం పెనాల్టీ ఎదుర్కోవలసి వస్తుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2022 మార్చి 29న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం చూస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30లోపు లింక్ చేసుకుంటే రూ.500 కట్టాలి. అదే జూలై 1 తర్వాత అనుసంధానం చేసుకుంటే రూ.1000 చెల్లించాలి. మీరు 2023 మార్చి 31లోపు కూడా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే అప్పుడు మీ పాన్ కార్డు చెల్లదు. అయితే 2023 మార్చి చివరి వరకు పాన్ కార్డు మాత్రం చెల్లుబాటు అవుతుంది.
ఇది కూడా చదవండి: క్రికెట్ అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన జియో..!
ఆదాయపు పన్ను శాఖ నిబంధనల మేరకు పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ.. ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేసుకోవాలి. లేదంటే భారీ జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. ముందుగా పాన్ కార్డు చెల్లుబాటు కాకుండా చేస్తారు. అటుపైన ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 272బీ ప్రకారం ఇన్‌యాక్టివ్ పాన్ కార్డు కలిగిన వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి.
ఆధార్ – పాన్ లింక్ చేయండి ఇలా..
ఎస్ఎంఎస్ ద్వారా..
మీ మొబైల్ నంబర్ నుంచి ఎస్ఎస్ఎస్ పంపడం ద్వారా కూడా పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు. ఇందుకోసం UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి.. 12 అంకెల ఆధార్ నంబర్‌ను, 10 అంకెల పాన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఈ మెసేజ్‌ను 567678 లేదా 56161కు పంపాలి. దీనితో పాన్-ఆధార్ లింక్ పూర్తవుతుంది.
లింక్ స్టేటస్ తెలుసుకొండిలా..
కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేసి.. ఆధార్, పాన్ నంబర్లను ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లింక్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఎస్ఎంఎస్ ద్వారా..
12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి.. 10 అంకెల పాన్ నంబర్‌ను ఎంటర్ చేసి 567678 లేదా 56161కు మెసేజ్ పంపడం ద్వారా లింక్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఇళ్లు కట్టుకోవడానికి హోమ్ లోన్ తీసుకోవడం మంచిదేనా?