దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు బంపరాఫర్ ప్రకటించింది. నీట్ 2022 పరీక్ష రాయనున్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి 18లక్షల మందికి పైగా విద్యార్ధులు నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. ఈ తరుణంలో నీట్ ఎగ్జామ్ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్ పై 60% డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా జరిగే నీట్ ఎగ్జామ్ కోసం పట్టణ,గ్రామాల విద్యార్ధినులు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలో ఆలస్యమై.. పరీక్ష రాసేందుకు వీలులేక ఎగ్జామ్ సెంటర్ నుంచి వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ ఏడాది జులై 17న (ఆదివారం) జరిగే నీట్ ఎగ్జామ్ రాయనున్న విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తక్కువ ధరలో ఓయో రూమ్స్ లో బసచేసేలా అవకాశాన్ని కల్పించింది.
విద్యార్ధినులు ఓయో డిస్కౌంట్ ఎలా పొందాలంటే!
విద్యార్థులు ఎంచుకునే హోటళ్లలో వైఫైతో పాటు ఏసీ సదుపాయాలు కూడా ఉంటాయని ఓయో సంస్థ తెలిపింది. ఆదాయమే లక్ష్యంగా పనిచేసే ఒక సంస్థ.. పరీక్ష రాసే విద్యార్థులు కోసం ఇంత మంచి అవకాశాన్ని కల్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#OYO is offering up to 60% discount for NEET 2022 women aspirants #neet2022 @oyorooms
Here’s how to avail it: https://t.co/wHQ0Hs8HSs
— Zee News English (@ZeeNewsEnglish) July 13, 2022
ఇదీ చదవండి: Prepaid Plans: ప్రతినెలా ఒకేరోజు రీఛార్జ్ చేసుకోవాలా.. అయితే.. ఈ ప్లాన్స్ మీ కోసమే!
ఇదీ చదవండి: Prefab Homes: మీ సొంత స్థలంలో 20 లక్షలకే అదిరిపోయే డూప్లెక్స్ హౌస్!