‘వన్‌ప్లస్‘.. స్మార్ట్‌ఫోన్ వాడే వారికీ ఈ పేరును పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. కాకుంటే.. కాస్త ధర ఎక్కువ. గతంలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే.. దాని రేట్ ఎక్కువ.. అంత డబ్బు మనమెక్కడ పెట్టగలం అనేవారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని.. మరింత మందికి దగ్గర అవ్వాలనే ఉద్దేశ్యంతో.. వన్‌ప్లస్ సంస్థ ‘నార్డ్ సిరీస్’ ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ధర రూ.20 నుంచి 30 వేల ఉండడంతో.. యూజర్స్ వన్ ప్లస్ కు బాగానే అట్ట్రాక్ట్ అయ్యారు. వినియోగదారులకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశ్యంతో రూ.20,000 బడ్జెట్‌లో నార్డ్ సీఈ 2 5జీ లైట్ మోడల్ తీసుకురానుందని వార్తలొస్తున్నాయి.
తాజాగా.. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ 10 ప్రో‘ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైన నేపథ్యంలో వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లపై గరిష్టంగా రూ. 10 వేల వరకు తగ్గించింది. ఈ తగ్గింపు ధర.. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, దేశవ్యాప్తంగా ఉన్న వన్‌ప్లస్ అధీకృత రిటైల్ స్టోర్స్‌లో లభిస్తాయి.
వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో రెండు మోడల్స్ 8జీబీ + 128జీబీ, 12 జీబీ + 256జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.
మోడల్ అసలు ధర ప్రస్తుత ధర డిస్కౌంట్
వన్‌ప్లస్ 9 (8జీబీ + 128జీబీ) రూ.49,999 రూ.40,599 రూ.9,400
వన్‌ప్లస్ 9 (12జీబీ + 256జీబీ) రూ.54,999 రూ.45,599 రూ.9,400
వన్‌ప్లస్ 9 ప్రో (8జీబీ + 128జీబీ) రూ.64,999 రూ.54,199 రూ.10,800
వన్‌ప్లస్ 9 ప్రో (12జీబీ + 256జీబీ) రూ.69,999 రూ.59,199 రూ.10,800
వన్‌ప్లస్ 9 స్పెసిఫికేషనన్స్:
6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
48ఎంపీ + 50ఎంపీ + 2ఎంపీ రియర్ కెమెరా
16ఎంపీ సెల్ఫీ కెమెరా
4,500mAh బ్యాటరీ
65W ఛార్జింగ్ సపోర్ట్
ఆండ్రాయిడ్ 11 వర్షన్
కలర్స్: వింటర్ మిస్ట్, ఆర్కిటిక్ స్కై, ఆస్ట్రల్ బ్లాక్
వన్‌ప్లస్ 9 ప్రో స్పెసిఫికేషనన్స్:
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
48ఎంపీ + 8 ఎంపీ + 50ఎంపీ + 2ఎంపీ రియర్ కెమెరా
16ఎంపీ సెల్ఫీ కెమెరా
4,500mAh బ్యాటరీ
65W ఛార్జింగ్ సపోర్ట్
ఆండ్రాయిడ్ 11 వర్షన్
కలర్స్: మార్నింగ్ మిస్ట్, ఫారెస్ట్ గ్రీన్, స్టెల్లార్ బ్లాక్
ఇది కూడా చదవండి: రూ.15 వేల లోపు లభిస్తున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే..!