అందరూ ఊహించిందే జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రం పెట్రో మంట పెడుతుందని భావించారు. దానికి తగ్గట్లే.. గడిచిన ఐదు రోజుల్లో ఏకంగా నాలుగుసార్లు పెట్లో రేట్లు పెంచారు. తాజాగా శనివారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై 89పైసలు, డీజిల్‌పై 86పైసలు పెరిగాయి.
ఇది కూడా చదవండి: దేశంలో పెట్రో ధరల మంట! బంకుల మూసివేత దిశగా కంపెనీలు..!
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలను పెంచనందుకు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్ ఏకంగా 2.25 బిలియన్ డాలర్ల (రూ.16,875 కోట్లు) ఆదాయాన్ని నష్టపోయినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నట్లు సమాచారం. ఈ ఐదు రోజుల్లో పెట్రోల్ రేటు మూడు రూపాయలు పెరిగింది.
దేశంలో పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
1.హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.80 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.98.10గా ఉంది.
2.విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.60 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.99.56 పైసలుగా ఉంది.
3.ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.61పైసలు ఉండగా డీజిల్ ధర రూ.89.87 పైసలుగా ఉంది.
4.ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.35పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.97.55పైసలుగా ఉంది.
5.చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.43పైసలు ఉండగా డీజిల్ ధర రూ.94.47పైసలుగా ఉంది.
6.బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.103.93 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.88.14పైసలుగా ఉంది.
పెరిగిన పెట్రో ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.