వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తోన్న ఓలా బైక్ విడుదలకు రెడీ ఐపోయింది. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు ప్రజల చెంతకు వచ్చేందుకు ముస్తాబైంది. ఎలక్ట్రిక్ వెహకిల్స్ బుకింగ్‌లో సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పిన ఓలా స్కూటర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్‌ను ఓలా కంపెనీ ప్రకటించి బైక్‌పై ఆసక్తిని పెంచింది. ఓలా స్కూటర్‌కు సంబంధించి ప్రస్తుతం కొన్ని ఫీచర్లు, ధర ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. విడుదలకు కొద్ది గంటల ముందునుంచే ఈ సందడి మొదలైంది. విడుదలయ్యాకే అసలు ధర, ఫీచర్లు తెలియనున్నాయి.
కేవలం 24 గంటల్లో దాదాపు 1000 నగరాల్లో లక్ష ప్రీ బుకింగ్‌లు వచ్చిన క్రేజ్ చూసి పలు కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్‌లను విపణిలోకి తెచ్చే పనిలో పడ్డాయి. ఇప్పటికే దిగ్గజ మోటర్ కంపెనీ హీరో ఎలక్ట్రిక్ ఈ రంగంలోకి ప్రవేశించింది. అలాగే సింపుల్ వన్ కంపెనీ కూడా ప్రీ బుకింగ్ ప్రారంభించేసింది. ఎన్నో సంచనాలకు మారుపేరుగా నిలిచిన ఓలా ఎలక్ట్రిక్ బైక్‌పైనే అందిరి చూపు. లీకైన ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి.
ప్రస్తుత అంచనాల ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే దాదాపు 150 కిలో మీటర్లు ప్రయాణిస్తాయని తెలుస్తోంది. అయితే కంపెనీ నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. అంతే కాదండోయ్ ‘ఓలా స్కూటర్లు ముందుకే కాదు వెనుకకూ ప్రయాణించగలవు. తాళం లేకపోయినా.. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌తో స్కూటర్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఓలా బైక్ పొడవు 1,860 మిల్లీమీటర్లు, వెడల్పు 700 మిల్లీ మీటర్లు ఉన్నట్లు సమాచారం. బరువు 74 కిలోలు ఉండే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ బైక్ 3.4 కిలోవాట్ బ్యాటరీతో రానున్నట్లు సమాచారం.
2019లో ఫేమ్-2 ఫథకం కింద కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. మినిమం రేంజ్ 80 కిలోమీటర్లు, టాప్ స్పీడ్ 40కిలోమీటర్ల వేగం ఉన్న బైక్‌లకు మాత్రమే ఈ సబ్సీడీ అందనుంది. సబ్సీడీ కింద కిలో వాట్ అవర్‌కి రూ.10వేల సబ్సీడీ ఇస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. దానిని సవరించి.. ప్రస్తుతం 50శాతం అంటే కిలో మీటర్ కేడబ్ల్యూహెచ్‌కి రూ.15వేలు ఇస్తున్నట‍్లు పేర్కొంది. అయితే, కేంద్రం అందించే ఈ సబ్సీడీ ఓలా ఎలక్ట్రిక్ బైక్‌కు వర్తిస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి ధర ఎలా ఉండబోతోంది అంటే… ఎక్స్‌షోరూం ధర లక్షా 20 వేల నుంచి లక్షా 30 వేల మధ్య ఉంటుందుని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.