మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారా? అయితే మీకు ఓలా కంపెనీ రూ. 9 వేల నుంచి రూ. 19 వేల వరకూ డబ్బులు వెనక్కి ఇస్తుంది. ఎందుకంటే?
ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఛార్జర్లకు ఆయా కంపెనీలు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. బ్యాటరీ ఛార్జర్ కొనాలంటే కంపెనీని బట్టి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు సమయంలో ఎవరైతే బ్యాటరీ ఛార్జర్ ను కొనుగోలు చేశారో వారికి డబ్బులు వెనక్కి వస్తాయి. అయితే ఇది కేవలం ఓలా ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఓలా వాహనం కొనుగోలు చేసినప్పుడు యాడ్ ఆన్ సర్వీస్ కింద ఛార్జర్ కి సెపరేట్ గా డబ్బులు వసూలు చేసింది కంపెనీ. ఆ డబ్బులను ఇప్పుడు కస్టమర్లకు రిఫండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఎందుకంటే?
ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న వారికి ఓలా కంపెనీ శుభవార్త చెప్పింది. ఓలా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు సమయంలో బ్యాటరీ కోసం ప్రత్యేకంగా ఛార్జ్ చేసిన కంపెనీ.. ఆ డబ్బులను ఇప్పుడు కస్టమర్లకు వెనక్కి ఇచ్చేస్తుంది. ఎవరైతే రూ. 9 వేల నుంచి రూ. 19 వేల వరకూ ఛార్జర్ కోసం ఖర్చు పెట్టారో వారికి ఆ డబ్బులను కంపెనీ రిఫండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. అధిక ధరలపై భారీ పరిశ్రమల శాఖ చేపట్టిన విచారణ నేపథ్యంలో ఓలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి వసూలు చేసిన ఛార్జర్ డబ్బులను వెనక్కి ఇచ్చిన తర్వాతే సబ్సిడీ డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో ఓలా కంపెనీ తమ కస్టమర్లకు ఛార్జర్ డబ్బులు రిఫండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
తమ కస్టమర్లకు రూ. 130 కోట్లు వెనక్కి ఇస్తున్నట్లు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) కి రాసిన లేఖలో పేర్కొంది. 2019-2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 మార్చి 30 వరకూ ఎవరైతే ఓలా ఎస్1 ప్రో మోడల్ కొన్న సమయంలో బ్యాటరీ ఛార్జర్ కొన్నారో వారందరికీ సుమారు రూ. 130 కోట్లు రిఫండ్ చేసేందుకు సంకల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. ఇదిలా ఉంటే భారీ ధరలపై విచారణ, సబ్సిడీల నిలిపివేత గురించి ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ స్పందించారు. ప్రభుత్వం ఏదడిగితే అది తమ కంపెనీ చేస్తుందని.. సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంతో టచ్ లో ఉందని అన్నారు. మరి ఓలా కంపెనీ ఛార్జర్ ను ప్రత్యేక ధర చెల్లించి కొన్న కస్టమర్లకు రిఫండ్ ఇస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.