కరోనా కాలంలో ఆదుకున్న వర్క్ ఫ్రం హోం విధానానికి టెక్ కంపెనీలు ఒక్కొక్కటిగా గుడ్ బై చెబుతున్నాయి. ఇప్పటికే వారానికి రెండు రోజులు, మూడు రోజులు ఆఫీస్ కు రావాలని సూచించిన కంపెనీలు.. ఇకపై 100 శాతం కంపెనీ నుంచే విధులు నిర్వహించాలంటూ హుకుం జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. వర్క్ ఫ్రం హోమ్ విధానానికి సంపూర్ణంగా ముగింపు పలుకుతున్నట్టు తెలిపింది. ప్రతి ఉద్యోగి ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని స్పష్టంచేసింది. ఈ విషయాన్ని టీసీఎస్ సీవోవో ఎన్ గణపతి సుబ్రమణియమ్ ఇటివల ఓ ఇంటర్వ్యూలో నిర్ధారించారు.
ఆఫీస్ నుంచి పనిచేయాలనుకుంటున్న ఉద్యోగుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వర్క్ ఫ్రం హోమ్‌ను టీసీఎస్ పూర్తిగా రద్దు చేస్తోందని ఎన్.గణపతి సుబ్రమణియమ్ వివరించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కొవిడ్ కేసు మరోమారు పెరుగుతున్న దృష్ట్యా ఆఫీసుల్లో తగిన జాగ్రత్త చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు తగిన వెసులుబాటు కల్పిస్తామని ఆయన తెలిపారు. అలాగే.. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేస్తే మరిన్ని విషయాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయన్న ఆయన, పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. “కరోనా కాలంలో విధుల్లో చేరిన ఉద్యోగులకు అనుభవం చాలా అవశ్యం. కొత్త ఉద్యోగులు ఆఫీస్‌లకు వస్తే.. వారివారి పాత్రలు ఏంటనేవి ఉద్యోగులకు తెలుస్తాయి..’ అని ఆయన వెల్లడించారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పటి నుంచి పూర్తిగా రద్దవుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, టీసీఎస్ గతేడాది ఉద్యోగులందరూ వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలంటూ ఈ-మెయిల్ ద్వారా సమాచారమిచ్చిన సంగతి తెలిసిందే. టీం సూపర్‌వైజర్ నిర్ణయించే రోస్టర్ ప్రకారం.. ఆఫిస్ కు వచ్చి పనిచేయాలని తెలిపింది. టీసీఎస్ సీనియర్లు కొంతకాలంగా ఆఫీస్ నుంచి పనిచేస్తుండడంతో కస్టమర్ల కూడా కార్యాలయాలను సందర్శిస్తున్నారని ఈ-మెయిల్స్‌లో వివరించింది. కాగా, 2020 మే నెలలో కొవిడ్ తీవ్రత దృష్ట్యా టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది.
Permanent remote working ends for Tata Consultancy Services (TCS) employees as the IT giants ask everyone to return to office desks. TCS employees who were enjoying a 100 per cent work-from-home will have to come back to the office according to the need of their role. pic.twitter.com/cdExb9js8k
— Sankushmedia (@sankushmedia) January 13, 2023