Pan-Aadhaar: పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయటం తప్పని సరంటూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో పాన్-ఆధార్ లింకింగ్‌కు సంబంధించి సీబీడీటీ ఆఖరి తేదీని పొడగించింది. పాన్-ఆధార్‌ను లింక్ చేయని వారు 2022 మార్చి 31లోగా లింక్ చేసుకోవాలని తెలిపింది. ఆ గడువు తేదీ కూడా పూర్తయి నెల దాటింది. ఇప్పుడు పాన్-ఆధార్ లింకింగ్‌కు సంబంధించి మరో తాజా అప్‌డేట్ వచ్చింది. ఇప్పటివరకు పాన్-ఆధార్ లింక్ చేయని వారి పాన్‌కార్డులు 2023 మార్చి 31వ తేదీనుంచి పనిచేయవని సీబీడీటీ తెలిపింది.
2023 మార్చి 31లోగా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే, పెనాల్టీ కడితేనే లింక్ సాధ్యం అవుతుందని వెల్లడించింది. పెనాల్టీగా 1000 రూపాయలు చెల్లించాలని తెలిపింది. జూన్ 30, 2022లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసిన వారు కూడా ఫైన్ కట్టాల్సిందేనని, వారు 500 రూపాయలు చెల్లించాలని సీబీడీటీ తెలిపింది. ఇక, 2023 మార్చి 31వ తేదీ నాటికి కూడా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారి పాన్‌లు పని చేయవని స్పష్టం చేసింది.
పెనాల్టీతో పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయటం ఎలా?..
ప్రొసీడ్ కొట్టగానే ఎన్‌ఎస్‌డీఎల్ ద్వారా మీ పేమెంట్ అయిపోతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ ఫైలింగ్ పోర్టల్‌లో కనిపించడానికి కొన్నిరోజులు పడుతుంది. మరి, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవటంపై విధించిన ఫైన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nothing Phone: నథింగ్ ఫోన్ 1 లో కరణ్ జోహార్, యువరాజ్ సింగ్ పెట్టుబడులు!