సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో వివాహం అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది. మరి డబ్బున్న వారి ఇంట్లో పెళ్లి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక ముకేష్ అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మాటలా. ఆకశమంత పందిరి, భూలోకమంత మండపం అన్నట్లుగా ఉంటాయి వారి ఏర్పాట్లు. గురువారం అంబానీ ఇంట పెళ్లి సందడి మెుదలైంది. ముకేష్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన చిన్న నాటి స్నేహితురాలు, మర్చంట్ వారసురాలైన రాధికా మర్చంట్ కు అనంత్ కు గురువారం నిశ్చితార్థం జరిగింది.
అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మెుదలైంది. చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన శైలా, వీరెన్ మర్చంట్ ల కుమార్తె అయిన రాధికా మర్చంట్ కు గురువారం అంగరంగ వైభంగా నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్ లోని నాథ్ ద్వారాలో ఉన్న శ్రీనాథ్ జీ ఆలయంలో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన దగ్గరి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక అనంత్-రాధికలు చిన్నప్పటి నుంచి స్నేహితులు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారడంతో.. ఇరుకుటుంబాలకు చెందిన పెద్దలు.. వారి పెళ్లికి అంగీకరించారు. దాంతో వీరిద్దరు వివాహబంధం ద్వారా త్వరలో ఒక్కటి కాబోతున్నారు. ఇక వీరిద్దరు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అలాగే ప్రస్తుతం తమ తల్లిదండ్రుల నిర్వహిస్తున్న వ్యాపారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.