అంబానీ ఇంట ఏ ఫంక్షన్ జరిగినా.. దాని గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. ఎంతో ఆడంబరంగా, అట్టహాసంగా నిర్వహిస్తారు. దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన టాప్ సెలబ్రిటీలంతా అంబానీ ఇంట ఫంక్షన్‌లో సందడి చేస్తారు. ఇక తాజాగా ఎన్‌ఎంసీసీ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
గత కొన్ని రోజులుగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్‌ఎంసీసీ) పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతుంది. దేశంలోని కళారంగాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయ కళలను ప్రోత్సహించడం కోసం ఈ భవనాన్ని నిర్మించాడు ముఖేష్ అంబానీ. అది కూడా తన భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ పేరు మీద దీన్ని ఏర్పాటు చేశాడు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అత్యంత విశాలంగా, ఎంతో సుందరంగా ఈ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించారు. మార్చి 31న ఈ భవనం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు వేడుకలు నిర్వహించారు. అంబానీ కుటుంబం ఎంతో అట్టహాసంగా ఈ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం రాజకీయ, సినీ, క్రీడా లోకం నుంచి సెలబ్రిటీలు తరలి వచ్చారు. ఆంగ్ల మీడియాలో ఎక్కడ చూసిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీన్ని చూసిన వారు.. అంబానీలు తల్చుకుంటే ఇదే మాత్రం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు..
ఈ కార్యక్రమంలో పాల్గొడానికి వచ్చిన వారికి.. అంబానీ కుటుంబం మరిచిపోలేని విందు ఏర్పాటు చేసింది. వివిధ రకాల వంటకాలను వడ్డించింది. ఎన్ని వంటలు పెట్టినా సరే.. ఒక్కటి మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే దౌలత్‌కి చాట్. చూడ్డానికి హల్వాలా ఉంది. ఉత్తరాదిలో ఈ స్వీట్ చాలా ఫేమస్. మరి దీని గురించి మాత్రమే ఎందుకు చర్చించుకుంటున్నారు.. నార్త్‌లో అందరూ చేసుకునేదే కదా.. అంతే విశేషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా. అది నార్మల్ హల్వానే. కానీ దాన్ని వడ్డించిన విధానం మాత్రం చాలా ప్రత్యేకం. మట్టి పాత్రలో.. ఆకులో ఈ స్వీట్ వడ్డించారు. ఆ పాత్రలను ఐదు వందల రూపాయల నోట్లతో అలంకరించారు. దాంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారు.. అంబానీ ఇంట ఫంక్షన్ అంటే.. ఆ మాత్రం ఉండాల్సిందే కదా అంటున్నారు.
మరి కొందరేమో.. ఎంత సంపద ఉంటే మాత్రం.. ఇలా డబ్బులు సర్వ్ చేయడం ఏంటని విమర్శిస్తున్నారు. డబ్బున్న వాళ్లు ఏం చేసినా చెల్లుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఏంటంటే.. అవి రియల్ నోట్లు కాదు. జీరాక్స్ నోట్లు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ వేడుకలో పాల్గొనడానికి బాలీవుడ్ తారా లోకం తరలి వచ్చింది. ఎన్‌ఎంసీసీ ప్రారంభోత్సవానికి రాజకీయ, క్రీడా, సినీ, పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా-నిక్ జొనాస్, సచిన్ టెండూల్కర్–అంజలి దంపతులతో పాటు ఐశ్వర్యరాయ్, ఆలియా భట్ సహా బాలీవుడ్ సెలబ్రిటీలంతా కనిపించారు. ఇక ప్రియాంక చోప్రా అయితే.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం అమెరికా నుంచి భర్త, బిడ్డతో కలిసి వచ్చింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.