భారత దేశానికి చెందిన వ్యాపారవేత్తల్లో దీరూబాయ్ అంబాని ఒకరు. ఆయన వారసుడైన ముకేశ్ అంబాని తండ్రికి తగ్గ తనయుడిగా వ్యాపార రంగంలో తనదైన మార్క్ చాటుకున్నారు. ఆయన ఇప్పుడు అపర కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. రియలన్స్ అన్ని రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరింపజేస్తుంది. అయితే ముకేశ్ అంబాని ప్రస్తుతం ఆస్తుల పంపకం మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్ లో తన పిల్లల మద్య ఎలాంటి విభేదాలు రాకుండా వ్యాపారాలను మూడు విభాగాలు చేసి.. తన ముగ్గురు పిల్లలకు పంచనున్నట్లు తెలుస్తుంది.
భారత దేశంలో దిగ్గజ బిజినెస్ మాన్ ముకేశ్ అంబానీ జీవితం గురించి అందరికీ తెలిసిందే. తన తండ్రి ఇచ్చిన ఆస్తులను సోదరుడితో కలిసి రెట్టింపు చేశారు. తండ్రి చనిపోయిన తర్వాత వ్యాపారలావాదేవీల్లో విభేదాలు రావడంతో విడిపోయారు. తర్వాత కొన్ని మనస్పర్ధలు కూడా వచ్చాయి. ఇప్పటికీ రెండు కుటుంబాల మధ్య దూరం ఉంది అంటుంటారు. తమలా తన పిల్లల మద్య విభేదాలు రావొద్దన్న ఉద్దేశ్యంతో ముకేశ్ ముందునుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆస్తుల పంపకంలో కొత్త స్ట్రాటజీ తీసుకువస్తున్నారు.
ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆకాశ్, ఈషా కవల పిల్లలు. చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ఇక అంబానీ తన ఆస్తులను ముగ్గురు పిల్లలకు సరి సమానంగా పంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. భవిష్యత్ లో తన పిల్లలు ఆస్తుల విషయంలో గొడవలు పడకుండా పక్కా ప్రణాళికతో తన వారసులకు ఆస్తుల పంపకం ప్రక్రియను ముకేశ్ మొదలు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.
రెండు రోజుల క్రితమే రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి, ఆ ప్లేస్ లో పెద్ద కొడుకు ఆకాష్ అంబానీని కుర్చోపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు రియలన్స్ లో కీలక మైన విభాగం ఇషా చేపట్టబోతున్నట్టు సమాచారం. అలాగే చిన్న కొడుకు అనంత్ అంబానీకి సైతం కీలక విభాగం అప్పగించినట్లు తెలుస్తోంది.
ఈ విధంగా ముకేశ్ అంబాని సరైన సమయానికి సరైన రీతిలో నిర్ణయం తీసుకొని ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా.. భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని పలువురిని సంప్రదించి తన ఆస్తుల పంపకాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎవరు ఏ రంగంలో ఉన్నారో.. ఆ విధులు నిర్వర్తిస్తున్నారో.. పూర్తిగా వారికి ఆ బాధ్యతలు అప్పగించాలని.. ముకేశ్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ పనికి పలువురు ప్రశసంలు కురిపిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.