ముంబై దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఇల్లు కొనాలంటే.. కోట్లు ఖర్చు చేయాలి. అదే పాష్ ఏరియాలో ఇంటిని సొంతం చేసుకోవాలంటే.. పదులు, వందల కోట్లు వెచ్చించాలి. ఇక తాజాగా దేశంలోనే ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు ఓ వ్యాపారవేత్త. ఆ వివరాలు..
సాధారణంగా నేటి కాలంలో ఇల్లు కట్టాలంటే.. ఎంత లేదన్నా.. తక్కువలో తక్కువ సుమారు 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాస్త లగ్జరీగా కట్టాలి అనుకుంటే.. ఆ ఖర్చు మరింత పెరుగుతుంది. ఇక నేటి కాలంలో సామాన్యులు సైతం.. ఇంటిరీయర్ డిజైన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. లక్షలు ఖర్చు చేస్తున్నారు. అప్పు చేసైనా సరే ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు. ఇక హైదరాబద్ వంటి మెట్రో నగరాల్లో.. ఇంటి అద్దెలే ఒక రేంజ్లో ఉంటాయి. అలాంటి చోట ఇల్లు కొనడం అంటే మాటలు కాదు. ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అంటే కోట్లు ఖర్చు చేయాలి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలన్నా అర కోటి చెల్లించుకోవాలి. కాస్త పాష్ ఏరియాలో ఇల్లు కొనాలంటే.. కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక తాజాగా దేశంలోనే ఖరీదైన ఫ్లాట్ ఒకటి అమ్మకానికి వచ్చింది. వందల కోట్ల రూపాయలు చెల్లించి.. దాన్ని సొంతం చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు..
హైదరబాద్‌లోనే ఇంటి ధరలు ఈ రేంజ్లో ఉంటే.. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో.. ఇళ్ల ధరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా ముంబై భారత్‌లోనే అత్యంత ఖరీదైన నగరంగా పేరు పొందింది. ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ధరే ఏకంగా కోటి రూపాయలు పలుకుతుంది. అలాంటిది అన్ని సౌకర్యాలతో.. విశాలమైన ఇంటిని కొనాలంటే.. కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఇక తాజాగా ముంబైలోనే కాక దేశంలోనే అత్యంత ఖరీదైన మూడంతస్తుల ఫ్లాట్ ఒకటి అమ్మకానికి వచ్చింది. దీని ధర.. 369 కోట్ల రూపాయలు. దేశంలోనే ఖరీదైన ఫ్లాట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మరి దీన్ని ఎవరు కొన్నారంటే..
ప్రముఖ పారిశ్రామికవేత్త, హెల్త్‌కేర్ ఉత్పత్తుల కంపెనీ ఫామీ కేర్ వ్యవస్థాపకుడు.. జేపీ తపారియా.. ఈ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. ఈ ఫ్లాట్ దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్స్ ప్రాంతంలో ఉంది. బీచ్ వ్యూ ఉన్న ఈ ట్రిపెక్ల్ ఫ్లాట్‌ను తపారియా కుటుంబం.. లోధా గ్రూప్‌కు చెందిన మార్కోటెక్ డెవలపర్స్ నుంచి కొన్నారు. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్ ఇదేనని వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబైలో సూపర్ లగ్జరీ నివాస టవర్గా పేరు తెచ్చుకున్న లోధా మలబార్ ప్యాలెస్‌లో.. 26,27,28 అంతస్తుల్లో ఈ ట్రిప్లెక్స్ ఉంది. ఈ ఫ్లాట్ వైశాల్యం.. 27,160 చదరపు అడుగులు. అంటే ఒక్క చదరపు అడుగే.. 1.36 లక్షల రూపాలయు ఖరీదు చేసింది. చదరపు అడుగుల ఆధారంగా చూసుకుంటే.. దేశంలో ఇదే అత్యంత విలువైన రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ డీల్ అంటున్నారు రియల్ ఎస్టెట్ మార్కెట్ విశ్లేషకులు. ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు తపారియా కుటుంబం స్టాంప్ డ్యూటీ కిందనే 19.07 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.