హైదరాబాద్ శివారు ప్రాంతాలే కదా అని తక్కువ అంచనా వేయకండి. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయ్యింది. కొన్ని ఏరియాల్లో పెట్టుబడులు పెడితే ఏడాదిలోనే మంచి ఫలితాలు చూడవచ్చు.
గతేడాది ఫ్లాట్ 43 లక్షలు.. ఇప్పుడు 55 లక్షలు.. ఏడాదిలో 12 లక్షలు లాభం. ఏంటి ఈ లెక్క అని అనుకుంటున్నారా? గాల్లో లెక్కలు కాదు. ప్రాక్టికల్ గా గత ఏడాది నుంచి ఈ ఏడాది మార్చి వరకూ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెరిగిన ధరలు కారణంగా వచ్చిన లాభం ఇది. పెట్టుబడి పెట్టడానికి, లాభాలు పొందడానికి స్థలం ఎక్కడున్నా స్థలమే. కాకపోతే ఆ ఏరియాలో మార్కెట్ ను బట్టి దాని విలువ అనేది పెరగడం, తగ్గడం అనేవి ఉంటాయి. ఏడాది క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఫ్లాట్ కొంటే ఏడాదిలో ఏకంగా 10 లక్షలు పైనే పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ శివారులో ఏ ఏరియాల్లో ఫ్లాట్ కొంటే మంచిది? అనేది చూద్దాం.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఏముంది అని లైట్ తీసుకోకండి. పెట్టుబడి పరంగా నగర శివారు ప్రాంతాలు కూడా ఇన్వెస్టర్ల పాలిట వరంగా మారాయి. ఏడాది క్రితం కోకాపేట్ లో 150 గజాల ఫ్లాట్ కనిష్టంగా రూ. 73 లక్షలు ఉంది. ఇప్పుడు దాని విలువ రూ. 86 లక్షలు అయ్యింది. ఏడాదిలో ఫ్లాట్ విలువ అనేది రూ. 13 లక్షలు పెరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ధరలు ఏ విధంగా పెరిగిపోతున్నాయో అనేది. కోకాపేట్ ఒక్కటే కాదు, నార్సింగి, తెల్లాపూర్, కోంపల్లి వంటి పలు ఏరియాలు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. హైదరాబాద్ నగర శివారులో ఏ ప్రాంతాల్లో ఫ్లాట్ కొంటే బాగుంటుంది? ఏడాది క్రితం, ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి? ఎంత శాతం పెరిగింది? అనే వివరాలు మీ కోసం.
ఇవే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలు మరియు వాటి ఏడాది వృద్ధి రేటు. కోకాపేట్ లో గత ఏడాది జనవరి, మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 5,631 చొప్పున అంటే గజం రూ. 50,679 కి ఫ్లాట్ కొన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు రూ. 59,589 వచ్చినట్టు. అంటే 150 గజాలకు రూ. 85,80,816 వచ్చినట్టు. ఆ వ్యక్తి రూ. 72,97,776 కి 150 గజాల ఫ్లాట్ కొంటే ఇప్పుడు దాని విలువ రూ. 85 లక్షలు పైనే ఉంది. దాదాపు ఏడాదిలో 13 లక్షల లాభం వచ్చింది. ఇలా నగర శివారులో ఫ్లాట్లు విలువ అనేది బాగా పెరిగాయి, పెరుగుతున్నాయి. ఫ్లాట్లే కాదు, స్థలాల ధరలు కూడా ఇంతకంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. పైన చెప్పబడిన ఏరియాల్లో ఫ్లాట్ లేదా స్థలం కొనుగోలు చేస్తే ఆరు నెలల్లో కనీసం 5 లక్షల లాభం పొందవచ్చు. ఏడాదిలో 10 లక్షలకు పైనే లాభం పొందవచ్చునని గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి పైన తెలుపబడిన ఏరియాల్లో ఫ్లాట్ కొనుక్కోవడం అనేది ఉత్తమ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం అంతర్జాలంలో దొరికిన నివేదికల ఆధారంగా ఇవ్వబడింది. మీకు ఒక అవగాహన రావడం కోసం ఇవ్వబడింది. దీని మీద పూర్తి అవగాహన కోసం ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్లను గానీ యజమానులను గానీ సంప్రదించవలసినదిగా మనవి.