ట్విట్టర్‌కు పోటీగా మరో కొత్త యాప్ రానుంది. దీని కోసం మెటా రంగంలోకి దిగుతోంది. ఆ యాప్ ఏంటి? దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్విట్టర్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా తమ అభిప్రాయాలను చెప్పేందుకు ఇది వేదికగా నిలిచింది. అలాంటి ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారీ డీల్‌తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అందులో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. భారీ ఎత్తున ఉద్యోగులను తీసేయడం, బ్లూ టిక్కు డబ్బులు వసూలు చేయడం లాంటి కొన్ని చర్యలు ట్విట్టర్‌కు, అలాగే మస్క్‌కు చెడ్డపేరును తీసుకొచ్చాయి. ఇదిలాఉండగా.. ట్విట్టర్‌కు పోటీగా బ్లూస్కై అనే యాప్‌ను తీసుకొస్తున్న సంగతి విదితమే. ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ట్విట్టర్‌కు పోటీగా ఇంకో యాప్ రాబోతోంది.
ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటా. మెటా నయా యాప్ మాస్టోడాన్ లాంటి డీసెంట్రలైజ్డ్ ఫ్రేమ్ వర్క్ పై ఆధారపడి పని చేయనుందని తెలుస్తోంది. ట్విట్టర్ వంటి సేవలను అందించే మాస్టోడాన్ను 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం మాస్టోడాన్ నెట్‌వర్క్‌కు 2 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. టెక్స్ట్ అప్డేట్స్ కోసం సోషల్ నెట్‌వర్క్‌ను అణ్వేషిస్తున్నట్లు.. క్రియేటర్స్, పబ్లిక్ ఫిగర్స్ తమ ఆసక్తులకు సంబంధించి సమయానుకూలంగా అప్డేట్స్ పంచుకునేందుకు ప్రత్యేకంగా యాప్ అవసరం ఉందని తాము భావిస్తున్నామని మెటా స్పోక్స్‌పర్సన్ వెల్లడించారు. అయితే మెటా కొత్త యాప్ ఎప్పుడు విడుదల చేసేది స్పష్టంగా తెలియజేయలేదు. మరి.. ట్విట్టర్‌కు పోటీగా వస్తున్న ఈ యాప్ ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.