కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల భవిష్యత్ కోసం అందిస్తోన్న పథకమే సుకన్య సమృద్ది యోజన. ఇందులో కేవలం ఆడ పిల్లల పేరిట మాత్రమే డబ్బులు పొదుపు చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఇందులో చేరోచ్చు. ఈ పథకం వలన అమ్మాయిలకు ఆర్థిక భద్రత ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వలన మీ అమ్మాయి కలలను సాకారం చేయవచ్చు. అయితే.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, RBI.. రెపో రేటును పెంచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అన్నియూ FD, RD వడ్డీ రేటును పెంచుతున్నాయి. ఈ పెంపు ప్రభుత్వ పథకాలకు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వడ్డీ రేట్లు పెరగనున్నట్లు సమాచారం.
సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టే వారికి 7.6% వార్షిక రాబడి అందుతుంది. అదేవిధంగా మీరు నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ల ఖాతా గురించి మాట్లాడినట్లయితే అది 5.8% రాబడిని అందిస్తుంది. కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది.
సుకన్య సమృద్ధి యోజన అర్హతలు, ప్రయోజనాలు: