మిడిల్ క్లాస్ వారి ఫేవరెట్ కారు, బడ్జెట్ కారు ఇక నుంచి కొందామన్నా కొనలేరు. ఎందుకంటే కంపెనీ ఆ కార్లను ఇకపై తయారు చేయకూడదని మారుతీ సుజుకీ ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే?
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఆల్టో 800 కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. మారుతీ సుజుకీ ఎంట్రీ లెవల్ మోడల్ కారు అయిన ఆల్టో 800ను ఇకపై కొనాలంటే కుదరదు. ఇది మధ్యతరగతి వాళ్లకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో ఉండేది ఈ ఆల్టో 800. బీఎస్6 ఫేజ్2 నిబంధనలకు అనుగుణంగా తమ ఆల్టో 800 కార్లను అప్ గ్రేడ్ చేయడం ఆర్థికంగా లాభదాయకం కాదని కంపెనీ భావించింది. దీనికి తోడు రోడ్డు ట్యాక్స్, మెటీరియల్, ఇతర రకాల పన్నులు పెరగడం కూడా వాహన కొనుగోలు ఖర్చు పెరగడానికి కారణాలు అయ్యాయి. అందుకే ఈ కార్ల ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఆల్టో 800 కార్ల ఉత్పత్తిని నిలిపివేయడానికి మరొక కారణం ఆల్టో కే10 కి డిమాండ్ పెరగడం. ఈ కారణాల వల్ల కంపెనీ ఆల్టో 800 కార్ల ఉత్పత్తిని నిలిపివేసిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నారు. ఆల్టో 800 ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా తగ్గుముఖం పడుతుందని.. హ్యాచ్ బ్యాక్ విభాగంలో వాహనాల కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగిందని అన్నారు. ఆల్టో 800 2000వ సంవత్సరంలో లాంఛ్ అయింది. 2010 వరకూ 18 లక్షల ఆల్టో 800 కార్లను విక్రయించింది. 2010 నుంచి ఇప్పటి వరకూ 17 లక్షల కార్లను విక్రయించగలిగింది.
ఆ తర్వాత అదే ఏడాదినా భారతీయ మార్కెట్లో ఆల్టో కే10 లాంఛ్ అవ్వగా.. 9.5 లక్షల కార్లను అమ్మగలిగింది. 796 సీసీ పెట్రోల్ ఇంజన్, సీఎన్జీ ఆప్షన్స్ తో వచ్చిన ఆల్టో 800 ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.54 నుంచి 5.13 లక్షల మధ్యలో ఉండేది. ఆల్టో 800 ఉత్పత్తి నిలిపివేసిన తర్వాత ఆల్టో కే10 మారుతీ సుజుకీ ఎంట్రీ లెవల్ మోడల్ కానుంది. ఆల్టో కే10 ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి రూ.5.94 లక్షల మధ్య ఉంది. మరి మధ్యతరగతి వారి అభిమాన ఆల్టో 800 కార్ల ఉత్పత్తిని మారుతీ సుజుకీ కంపెనీ నిలిపివేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.