కారు అనేది గతంలో అంటే విలాసంగా భావించేవారు. కానీ, పట్టణాలు, నగరాలు, మెట్రోపాలిటన్ సిటీల్లో అయితే కారు అనేది అవసరంగా మారిపోయింది. నలుగురు సభ్యులు ఉండే కుటుంబానికి కారు అవసరంగా భావిస్తున్నారు. కొత్త కారు కొనాలి అనుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే నిస్సాన్ కంపెనీ తమ మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.
ప్రతి ఒక్కరికి కారు కొనుక్కోవాలి అనే కల ఉంటుంది. నగరాలు, మెట్రోపాలిటన్ సిటీల్లో అయితే నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి కారు అనేది విలాసం కాదు.. అవసరమే అవుతుంది. అందుకే మధ్యతరగతి వాళ్లు కూడా ఇప్పుడు కారు కొనాలి అనే ఆలోచన చేస్తున్నారు. అలా కారు కొనాలనుకునే వారికి ఈ ఉగాది సరైందని చెప్పొచ్చు. ఎందుకంటే నిస్సాన్ కంపెనీ కార్లపై ఇప్పుడు అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ మార్చి నెలలో అద్భుతమైన డిస్కౌంట్స్ ని నిస్సాన్ కంపెనీ ప్రకటించింది. ఈ కంపెనీలో బాగా క్లిక్ అయిన మ్యాగనైట్ పై కూడా అత్యధికంగా రూ.90 వేల వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి.
నిస్సాన్ మ్యాగనైట్ మోడల్ చాలా బాగా క్లిక్ అయ్యింది. ఎన్నో టాప్ మోస్ట్ కంపెనీ ఎస్యూవీలకు నిస్సాన్ మ్యాగనైట్ గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పుడు మ్యాగనైట్ కారుపై నిస్సాన్ కంపెనీ రూ.90 వేల వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. రూ.20 వేలు ఎక్స్ ఛేంజ్ బోనస్ గా అందిస్తోంది. అతేకాకుండా ప్రీ మెయిన్టినెన్స్ ప్యాకేజ్ కింద రూ.12,100 వరకు ఆఫర్ చేస్తోంది. యాక్ససరీస్ కానివ్వండి, క్యాష్ డిస్కౌంట్ కింద మరో రూ.20 వేల వరకు ఆఫర్ ఉంది. రూ.15 వేలు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.10 వేలు లాయల్టీ బోనస్ గా అందిస్తున్నారు. అంతేకాకుండా ఆన్ లైన్ బుకింగ్ బోనస్ కింద రూ.2 వేలు తగ్గింపు పొందచ్చు. మొత్తానికి నిస్సాన్ మ్యాగనైట్ పై రూ.90 వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.10.90 లక్షల వరకు ఉంది.
అలాగే నిస్సాన్ కంపెనీకి చెందిన మరో మోడల్ నిస్సాన్ కిక్స్ పై కూడా డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయి. కిక్స్ పై గరిష్టంగా రూ.59 వేల వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఎక్స్ ఛేంజ్ బోనస్ కింద మీరు రూ.30 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే క్యాష్ డిస్కౌంట్ కింద మీకు రూ.19 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.10 వేలు తగ్గింపు పొందచ్చు. నిస్సాన్ కిక్స్ ని ఒకరకంగా ఫెయిల్యూర్ మోడల్ గా చెప్పచ్చు. ఎందుకంటే ఈ కారుకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీని ధర రూ.9.5 లక్షల నుంచి రూ.14.9 లక్షల వరకు ఉంది. త్వరలోనే నిస్సాన్ కంపెనీ కిక్స్ అమ్మకాలు నిలిపివేయనుంది.