ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా.. మార్కెట్‌లోకి సరికొత్త ఎస్‌యూవీ లాంచ్ చేసింది. స్కార్పియో స్వరూపాన్నే మార్చేస్తూ ఒక స్టన్నింగ్ లుక్‌తో అదిరిపోయే ఫీచర్లతో ఆల్ న్యూ స్కార్పియో-ఎన్ అనే ఎస్‌యూవీని అధికారికంగా విడుదల చేసింది. స్కార్పియోలో ఇది మూడో తరం మోడల్ గా చెబుతున్నారు. ఈ స్కార్పియో-ఎన్ మోడల్ బుకిగ్స్ జులై 30 నుంచి ఓపెన్ చేయనున్నారు. అంతేకాకుండా టెస్ట్ డ్రైవ్ చేసేందుకు జులై 5 నుంచి వినియోగదారులకు అవకాశం కల్పించనున్నారు. అన్ని మోడల్స్‌కు సంబంధించిన ధర, ఫీచర్లను వెల్లడించారు. ఒక్క AT, 4 వీల్ డ్రైవ్ వేరియంట్ల ధరలను జులై 21న వెల్లడిస్తారు. అయితే ప్రస్తుతం ప్రకటించిన ధరలన్నీ మొదటి 25 వేల కార్లకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ బేసిస్‌లో ఈ అమ్మకాలు జరుగుతాయని ప్రకటించారు.
స్కార్పియో-ఎన్ ధరల వివరాలు(ఎక్స్ షోరూమ్):
మహీంద్రా స్కార్పియో-ఎన్ బేసిక్ లెవల్ పెట్రోల్ MT Z2 వేరియంట్ ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభకానుంది. డీజిల్ వేరియంట్ ధర రూ.12.49 లక్షలుగా ఉంది. హై ఎండ్ మహీంద్రా స్కార్పియో-N డీజిల్ MT 4×2 Z8 L వేరియంట్ ధర రూ. 19.49 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. అన్ని వేరియంట్ల ధరల వివరాలు..
స్కార్పియో-N డీజిల్ MT 4×2
Z2- రూ.12.49 లక్షలు
Z4- రూ.13.99 లక్షలు
Z6- రూ.14.99 లక్షలు
Z8- రూ.17.49 లక్షలు
Z8L- రూ.19.49 లక్షలు
స్కార్పియో-N పెట్రోల్ MT 4×2
Z2- రూ.11.99 లక్షలు
Z4- రూ.13.49 లక్షలు
Z8- రూ.16.99 లక్షలు
Z8 L- రూ.18.99 లక్షలు
స్పెసిఫికేషన్లు:
మహీంద్రా కంపెనీ స్కార్పియో-ఎన్ ను పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్లలో అందుబాటులోకి తెస్తోంది. ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్లు డీజిల్ పవర్‌ట్రెయిన్‌కు మాత్రమే పరిమితం చేశారు. మహీంద్రా స్కార్పియో-N డీజిల్ 2.2-లీటర్ టర్బో ఛార్‌జ్డ్ ఇంజిన్ గరిష్ట శక్తి 175హీహెచ్‌పీ, 400ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. అయితే పెట్రోల్ వేరియంట్ మాత్రం 203బీహెచ్‌పీ పవర్, 380ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో ఛార్‌జ్డ్ మోటార్‌తో వస్తుంది.
ట్రిమ్స్ పరంగా Z2, Z4, Z6, Z8, Z8 L వంటి ఐదు ఆప్షన్లు ఉన్నాయి. టాప్-ఎండ్ Z8 Lకి మాత్రమే 6 లేదా 7 సీట్ల ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. మిగిలిన అన్ని మోడల్ స్కార్పియో-ఎన్ కార్లకు ఏడు సీట్లు లభిస్తాయి. ఇంక బాడీ విషయానికి వస్తే.. 4,662ఎంఎం పొడవు, 1,917ఎంఎం వెడల్పు, 1,857ఎంఎం ఎత్తులో ఉంటుంది. ఈ ఆల్‌న్యూ స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని కొత్త ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించారు. ఇది 57 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. ఈ స్కార్పియో-ఎన్ మొత్తం 7 కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
స్కార్పియో-ఎన్ ఫీచర్లు:
ఈ స్కార్పియో-ఎన్ స్పెసిఫికేషన్లు కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎల్‌ఈడీ హెడ్ లైట్స్, కీ-లెస్ ఎంట్రీ అండ్ గో, డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 8 ఇంచెస్ స్క్రీన్, అలెక్సా కంపాటబిలిటీ, వైర్‌లెస్ ఛార్జర్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, ఆటో ఇంజిన్ స్టార్ట్/స్టాప్, 12 స్పీకర్ సోనీ 3డీ ఆడియో సిస్టమ్, 6 వే పవర్ అడ్జస్ట్ మెంట్ డ్రైవర్ సీట్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఈ ఆల్ న్యూ స్కార్పియో-ఎన్ లో ఉన్నాయి.
సేఫ్టీ ఎక్విప్మెంట్:
ఈ స్కార్పియో-ఎన్‌లో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఏఎస్‌సీ), ట్రాక్షన్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డెసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటర్, డ్రైవర్ డ్రౌజీనెస్ వార్నింగ్ వంటి సేఫ్టీ కంట్రోల్స్, ఫీచర్లతో ఈ స్కార్పియో-ఎన్ ని రూపొందించారు. ఈ ఆల్ న్యూ స్కార్పియో-ఎన్ మోడల్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మీకు నచ్చాయా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.