సాధారణంగా పల్లెటూర్లు అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయి. మరికొన్ని పర్వాలేదు అన్నట్లుగా రోడ్లు, తాగునీరు, పక్కా బిల్డింగులు, కరెంట్ ఇలా కనీస సౌకర్యాలతో అభివృద్ధి చెంది ఉంటాయి. ఇక గ్రామాలు, పట్టాణాలు, దేశాలు ఇలా ఏవి తీసుకున్నా.. పేద, మధ్యతరగతి, ధనిక వర్గం ప్రజలు ఉంటారు. ఎక్కడా అందరూ పేదలు ఉండరు.. అలా అని అంతా ధనికులు ఉండరు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే గ్రామం మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఆ ఊరుని చూస్తే.. ముందు పల్లెటూరు అంటే నమ్మరు. లగ్జరీ ఇళ్లు.. శుభ్రమైన రోడ్లుతో.. ఖరీదైన హంగులతో అలరారుతుంది.
సామాన్యంగా గ్రామాల్లో గుడి, బడి కామన్‌గా ఉంటాయి. కాస్త పెద్ద ఊరు అయితే బ్యాంకు, చిన్నపాటి ఆస్పత్రి ఉంటుంది. కానీ ఈ గ్రామంలో మాత్రం ఏకంగా 16 బ్యాంకులు, పెద్ద ఆస్పత్రి ఉంది. ఇక ఆ ఊరి గ్రామస్తులు బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఏకంగా 5 వేల కోట్లకు పైగా డిపాజిట్ చేశారంటే.. అక్కడి వారు ఎంత ధనవంతులో ఊహించవచ్చు. ఇక ఆ ఊరంతా కోటీశ్వరులే ఉన్నారు. ఇంతకు ఆ ఊరు ఎక్కడ ఉంది అంటారా! గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉన్న మాదాపూర్ గ్రామం.
ఇది పేరుకు గ్రామమైనా.. ఒక చిన్న పట్టణంలా కనిపిస్తుంది. ఈ ఊరిలో దాదాపు 60వేల మంది నివసిస్తున్నారు. 16 బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో ఆ ఊరి గ్రామస్తులకు చెందిన రూ. 5,000 కోట్ల ఫిక్సడ్ డిపాజిట్లు ఉన్నాయి. దీన్ని NRI గ్రామం అని పిలుస్తుంటారు. ఈ ఊరి గ్రామస్తులు అమెరికా, బ్రిటన్, కెన్యా, కెనడా, ఆస్ట్రేలియా.. వంటి విదేశాల్లో పనిచేసిన తరువాత కొంత మొత్తంలో డబ్బులు సంపాదించాక సొంత ఊరికి తిరిగి వచ్చేశారు. ఆ డబ్బునంతా ఫిక్సడ్ డిపాజిట్ల రూపంలో ఆయా బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ మొత్తం రూ. 5,000 కోట్లకు చేరిందట. అలా అని వచ్చే ఆదాయంతో తిని కుర్చొవట్లేరు. ఊరి అభివృద్ధికి తమవంతుగా చేతనైన సహాయం చేస్తున్నారు. అలా అందరి సహకారముతో అభివృద్ధిలో దూసుకుపోతున్న మాదాపూర్ గ్రామం.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
గుజరాత్‌లో కోటీశ్వరుల గ్రామం ఇది. ఈ ఊరిలో 16 బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకుల్లో రూ.5,000 కోట్లకు పైగా డిపాజిట్ చేశారు. ఈ ఊరు ఎలా ఉందో చూశారా..#madhapar #gujarat pic.twitter.com/Mi6a8tKvkM
— BBC News Telugu (@bbcnewstelugu) November 29, 2022