పెళ్లి కోసం రుణాలు చేస్తున్నారా? అయితే ఓ బ్యాంకింగేతర ఫినాన్షియల్ సంస్థ ఏకంగా రూ. 25లక్షలు లోన్ ఇచ్చేందుకు ముందుకు వస్తోంది. దీని విధివిధానాలు ఏంటో తెలుసుకుందాం.
పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. పచ్చని పందిరిలో బంధుగణం అందరు ఒక్కచోటుకి చేరగా అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకను జరుపుకుంటారు. కానీ ఈ వ్యవహారం అంతా ఖర్చుతో కూడుకున్న పని. వివాహవేధిక మొదలుకుని సన్నాయి మేళాలు ఇలా ప్రతి ఏర్పాటు ఖర్చుతో కూడుకున్నదే. సమయానికి డబ్బు చేతిలో లేకపోతే అప్పుచేసి మరీ పెళ్లి తంతు జరిపిస్తుంటారు. ఇళ్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్లుగా పెళ్లి కోసం ఎంత ఖర్చు పెట్టినప్పటికి ఇంకా ఏదో ఓలోటు ఉంటూనే ఉంటుంది. కాగా ఈ క్రమంలో కొన్ని రకాల బ్యాంకులు వివాహ ఖర్చుల కోసం లోన్ అందిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం..
మీరు త్వరలో వివాహం చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీ దగ్గర పెళ్లి ఖర్చులకు సరిపడా డబ్బులు లేవా? అయితే మీ కోసమే మ్యారేజ్ లోన్ అందిస్తోంది ఎస్ఎమ్ఎఫ్జీ ఇండియా క్రెడిట్ బ్యాంకిగేతర ఫైనాన్షియల్ సంస్థ. వివాహ ఖర్చుల కోసం రూ. 25 లక్షల వరకు లోన్ అందిస్తోంది. వెహికిల్ లోన్, హౌజింగ్ లోన్ మాదిరిగానే పెళ్లికి కూడా రుణాలను అందిస్తోంది. ఈ లోన్ పొందడానికి భారత పౌరులై ఉండి, 21 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు.
ఇది వరకు మీరు జరిపిన లావాదేవీలను అనుసరించి శాలరీ కలిగిన ఉద్యోగులు, సొంత బిజినెస్ చేసుకునే వారు అనే సంబంధం లేకుండా రూ. 25 లక్షల రుణాన్ని పొందవచ్చును. ఈ లోన్ పొందే వారికి కనీస శాలరీ నాన్ మెట్రో ఏరియాల్లో నివసించే వారి ఆదాయం రూ. 20 వేలు. ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో నివసించే వారి ఆదాయం రూ. 25వేల వరకు ఉండాలి. సొంత వ్యాపారం కలిగిన వారు కనీస వార్షికాదాయాన్ని చూపించాల్సి ఉంటుంది. 11.99 వడ్డీరేటుతో మ్యారేజ్ పర్సనల్ లోన్ ను అందిస్తోంది ఎస్ఎమ్ఎఫ్ జీ ఇండియా క్రెడిట్. మీరు ఈ లోన్ ను ఎస్ఎమ్ఎఫ్జీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో పొందవచ్చును. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఎస్ఎమ్ఎఫ్ జీ ఇండియా క్రెడిట్ బ్రాంచ్ ను సంప్రదించండి.