మీకు రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ ని అందుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అలర్ట్. మీరు గనుక ఈ పని చేయకపోతే ఉచిత రేషన్ ఆగిపోతుంది.
మీకు రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ పథకాన్ని పొందుతున్నారా? అయితే మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. వచ్చే నెలాఖరు లోపు మీరు ఆధార్ తో రేషన్ కార్డుని అనుసంధానం చేయకపోతే రేషన్ కట్ అయిపోతుంది. రేషన్ కార్డుతో ఆధార్ ను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. మార్చి 31 2023 లోపు అనుసంధానం చేయాలని ప్రభుత్వం చెప్పినా ఇంకా కోట్లాది రేషన్ కార్డులు ఆధార్ తో అనుసంధానం చేయలేదు. దీంతో గడువు తేదీని జూన్ 30కి పొడిగించింది. జూన్ 30 లోపు రేషన్ కార్డుతో ఆధార్ ని అనుసంధానం చేయాలి. లేని పక్షంలో రేషన్ కార్డును ప్రభుత్వం రద్దు చేస్తుంది. అదే జరిగితే జూలై 1 నుంచి రేషన్ లో వచ్చే ఉచిత సరుకులు రావు. అందుకే జూన్ 30 లోపు రేషన్ కార్డుని, ఆధార్ కార్డుతో లింక్ చేయించండి.
రేషన్ కార్డుతో ఆధార్ ని లింక్ చేయడం వల్ల.. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులను పొందలేడు. అందుకే ప్రభుత్వం ఆధార్ ను అనుసంధానం చేయమని చెబుతోంది. ఈ ఆధార్ తో లింక్ చేయడం వల్ల అధిక ఆదాయ పరిమితి ఉన్న వారిని గుర్తించి అనర్హులుగా పరిగణిస్తుంది. దీని వల్ల అసలైన అర్హులు మాత్రమే సబ్సిడీ గ్యాస్ లేదా రేషన్ పొందగలుగుతారు. రేషన్ కార్డుతో ఆధార్ కార్డుని అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేట్ రేషన్ కార్డులు ఎగిరిపోతాయి. మధ్య దళారుల యథేచ్ఛను తగ్గించవచ్చు కూడా. కాబట్టి మీ వంతు బాధ్యతగా ఆధార్ తో రేషన్ కార్డును అనుసంధానం చేయండి. లేదంటే మీకే నష్టం. ఆధార్ తో రేషన్ కార్డు లింక్ చేయడానికి ఆఖరు తేదీ జూన్ 30 అని మర్చిపోకండి. ఈ లింక్ చేయడం ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో రెండు విధాలుగా చేసుకోవచ్చు.