అతిగా పెరుగుతున్న చమురు ధరలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాతావరణ కాలుష్యం వంటి కారణాలతో అందరూ ఎలక్ట్రానిక్ వాహనాలు దారి పడుతున్నారు. అదే ఇప్పుడు అనివార్యంగా కూడా కనిపిస్తోంది. కేంద్రం, రాష్ట్రాలు కూడా ఎలక్ట్రికల్ వెహికిల్స్ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు పలు నజరానాలను కూడా ప్రకటిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈవీ బైక్‌లు, కార్ల వినియోగం, కొనుగోళ్లు గతంతో పోలిస్తే చాలా బాగా పెరిగాయి. కానీ, ఎలక్ట్రికల్ కార్లు, బైక్‌ల వినియోగదారులకు ఎదురయ్య పెద్ద సమస్య ఛార్జింగ్. పలు మెట్రోపాలిటన్ సిటీల్లోనూ ఇంకా పూర్తిస్థాయిలో ఛార్జింగ్ పాయింట్లు రాలేదు. ఒకవేళ వచ్చినా పెట్రోలు నింపినట్లు అంత ఈజీగా నిమిషాల్లో ఛార్జింగ్ ఎక్కదు. కనీసం హాఫ్ బ్యాటరీ ఫుల్ అవ్వాలి అంటే గంట అన్నా వెయిట్ చేయాలి. ఆ సమస్యకు చెక్ పెడుతోంది నెదర్లాండ్స్‌కు చెందిన కంపెనీ.
నెదర్లాండ్స్‌కు చెందిన ‘లైట్ ఇయర్’ కంపెనీ సరికొత్త ఎలక్ట్రికల్ కారును అభివృద్ధి చేస్తోంది. అలాంటి ఇలాంటి కారు కాదు అది. ఏడాదికి రెండుసార్లు ఛార్జ్ చేస్తే చాలు. ‘లైట్ ఇయర్ వన్’ అనే కారును రూపొందిస్తోంది. ఈ కారు సౌరశక్తితో నడుస్తుంది. మహా అయితే ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు ఛార్జ్ చేస్తే చాలు అంటూ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అంతేకాకుండా అన్ని ఎలక్ట్రానిక్ కార్లతో పోలిస్తే లైట్ ఇయర్ వన్ కారు చాలా తక్కువ ఎనర్జీని ఉపయోగిస్తుందని తెలిపారు. దాదాపు 80 కిలోమీటర్లకు ఒక వాట్ మాత్రమే వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. అంటే అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు వినియోగించే ఎనర్జీ కంటే దాదాపు మూడు రెట్లు తక్కువన మాట.
Through the amber leaves, a green future stems. pic.twitter.com/LAy0iiyL8g
— Lightyear (@lightyear_cars) November 3, 2021
లైట్ ఇయర్ కారులో మరో విశేషం ఏంటంటే దాని మైలేజ్. అదే ఒకసారి ఛార్జింగ్‌తో ఎంతదూరం ప్రయాణం చేయచ్చు అని. టెస్టింగ్ సమయంలో ఒకసారి ఛార్జ్‌తో లైట్ ఇయవర్ వన్ కారు దాదాపు 709 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రోటోటైప్ కారును ఏడాదికి రెండుసార్లు ఛార్జ్ చేస్తే చాలని స్పష్టం చేశారు. డ్యూరబిలిటీ, సేఫ్టీకి సంబంధించి కూడా పలు టెస్టులు నిర్వహిస్తున్నారు. అతి త్వరలో ఈ లైట్ ఇయర్ వన్ కారును మార్కెట్‌లోకి విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ కారు అంత చీప్‌గా ఏమీ వచ్చేలా లేదు. దీని అంచనా ధర రూ.కోటీ 30 లక్షలకు(1,75,000 డాలర్లు) పైగానే ఉండచ్చని అంటున్నారు. మార్కెట్ ధర
ఇదీ చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్సీపై గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్స్..