ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలు తీసుకొస్తూ ప్రజల ఆదరణ చూరగొంటున్న ఎల్ఐసి రెండు రెండు టర్మ్ ప్లాన్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అందులో ఒకటి ఎల్ఐసి టెక్ టర్మ్ ఆన్ లైన్ పాలసీ కాగా, మరొకటి ఎల్ఐసి జీవన్ అమర్ ఆఫ్ లైన్ పాలసీ. నవంబరు 23 నుంచి ఈ రెండు ప్లాన్లు అందుబాటులో లేవని తెలిపింది. ఇందులో జీవన్ అమర్ ప్లాన్ ను ఎల్ఐసి 2019 ఆగస్టులో ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబరులో టెక్ టర్మ్ ప్లాన్ ను ప్రారంభించింది. ఉపసంహరించుకోవడానికి కారణం.. రీఇన్సురెన్స్ రేట్లు పెరగడమే అనిని, పాలసీల్లో తగిన మార్పులు చేసి త్వరలోనే కొత్త ప్రొడుక్టులను లాంచ్ చేస్తామని తెలిపింది.
ఈ రెండు ప్లాన్ల కాలపరిమితి.. 10 నుంచి 40 సంవత్సరాలు. అర్ధాంతరంగా పాలసీదారుడు మధ్యలోనే మరణిస్తే పాలసీ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ఎల్ఐసీ జీవన్ అమర్ ప్లాన్ ను కనీసం రూ.25 లక్షలు, ఎల్ఎస్ఐసీ టెక్ టర్మ్ ప్లాన్ కనీసం రూ. 50 లక్షలు హామీ మొత్తంతో కొనుగోలు చేయవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఆఫ్ లైన్ జీవన్ అమర్ ప్లాన్ తో పోలిస్తే ఆన్ లైన్ టెక్ టర్మ్ ప్లాన్ ధర తక్కువ. అలాగే.. ఈ రెండు ప్లాన్ల ప్రీమియంను ప్రాంభించింక్త్ నటి నుంచి ప్రారంభించలేదు. ఈ రెండు ప్లాన్లను ఉపసంహరించినప్పటికీ.. కొనుగోలు చేసిన పాలసీదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాఋ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎక్కడికీ పోవు. వారి పాలసీలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే, ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం ఈ పాలసీలు అందుబాటులో ఉండవు.
Seems LIC is withdrawing both its term plans: Tech-Term (online) and Jeevan Amar (offline) today 😲
🚩Source: circular below doing the rounds on Whatsapp.
Will keep you posted, once this is verified. pic.twitter.com/EqIC1nwYK6
— Mahavir Chopra / Beshak.org (@themahavir) November 22, 2022